KNRUHS Online Registration: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అడ్మీషన్ల గడువు తేదీని పొడిగించారు. నోటిఫికేషన్‌ ప్రకారం.. 2024-25 విద్యాసంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్‌, డెంటల్‌ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ.. ఆగస్టు3న నోటిఫికేషన్‌ జారీ చేసి సంగతి తెలిసిందే.

దీని ప్రకారం నిన్నటితో రిజిస్ట్రేషన్‌ గడువు పూర్తికాగా తాజాగా డెడ్‌లైన్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అభ్యర్థులు రేపు(ఆగస్టు15) సాయంత్రం 6గంటల లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలి. వాటి పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. 

Top 10 Medical Colleges In India : నేటి నుంచే కౌన్సెలింగ్‌.. దేశంలోని టాప్-10 మెడికల్‌ కాలేజీలు ఇవే..

నీట్‌-ఎండీఎస్‌-2024 పరీక్షలో అర్హత సాధించిన వారు అర్హులు నీట్-ఎండీఎస్‌ పరీక్షలో కట్-ఆఫ్‌ స్కోర్‌ జనరల్‌ కేటగిరిలో(800లకు) 50శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరిలో 40శాతం, దివ్యాంగులకు 45శాతంగా ఉంది.అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://tsmds.tsche.inను క్లిక్‌చేయండి


 

#Tags