IIT Madras Developed EV Charger: ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేసిన ఐఐటీ మద్రాస్‌.. దీని స్పెషాలిటీ ఇదే

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కనిపిస్తుంది. కార్లు, మోటార్‌ సైకిల్స్‌.. ఇలా ఈవీల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌పై ఆధారపడకుండా, పర్యావరణ హితం కోసం ఈ మధ్యకాలంలో చాలామంది ఎలక్ట్రిక్‌ వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ, మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్‌ స్టేషన్స్‌ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Job Mela: డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. రేపే జాబ్‌మేళా

ఈ నేపథ్యంలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. తాజాగా ఐఐటీ మద్రాస్‌ 'ప్లగ్జ్‌మార్ట్‌' అనే ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేసింది. ఇది తాజాగా ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) సర్టిఫికేషన్‌ను పొందింది. 60kW DC ఫాస్ట్‌ ఛార్జర్‌తో ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా పూర్తి దేశీ కంట్రోలర్‌ మాడ్యుల్‌తో పనిచేయడం విశేషం.

Jobs In Dr. Reddy's Laboratories: అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌ దరఖాస్తుల ఆహ్వానం

దీనిపై ప్లగ్జ్‌మార్ట్ సీఈవో వివేక్ సమీనాథన్ మాట్లాడుతూ.. భారత్‌లో ఈవీల వినియోగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్లే చైనా నుంచి ఛార్జింగ్‌ సాంకేతికతను కూడా వేగంగా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పూర్తి స్వదేశీ సాంకేతికను వినియోగిస్తూ ప్లగ్జ్‌మార్ట్‌తో మీ ముందుకొచ్చాం. 2019 నుంచే ఈ స్టార్టప్‌ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు భారత్‌లో సొంతంగా స్వదేశీ ఛార్జింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను నెలకొల్పడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. 
 

#Tags