RGUKT IIIT Basara Campus: ఆర్జీయూకేటీ బాసర లో ముగిసిన దివ్యాంగుల కౌన్సెలింగ్‌ 2024

RGUKT IIIT Basara Campus: ఆర్జీయూకేటీ బాసర లో ముగిసిన దివ్యాంగుల కౌన్సెలింగ్‌ 2024

బాసర: నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాల సమీకృత విద్యనభ్యసించేందుకు పీయూసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దివ్యాంగ విద్యార్థులకు మంగళవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలోని అకడమిక్‌ బ్లాక్‌లో దివ్యాంగ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించారు. స్పెషల్‌ ఆఫీసర్‌ సృజన మాట్లాడుతూ ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వెంకటరమణ ఆదేశాల మేరకు అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.

ఇదీ చదవండి: NEET UG 2024:‘నీట్‌ యూజీ-2024’కు రీ ఎగ్జామ్‌ లేదు: సుప్రీంకోర్టు

సిద్దిపేట జిల్లా పెద్ద లింగారెడ్డి గ్రామానికి చెందిన హారికకు ఎంపిక ధ్రువపత్రాన్ని స్పెషల్‌ ఆఫీసర్‌ సృజన, కన్వీనర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ అందజేశారు. మిగిలిన సీట్ల ఖాళీలను మూడో విడతలో భర్తీ చే స్తామని, దానికి సంబంధించిన జాబితాను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. గ్లోబల్‌ కోటా స్వ రాష్ట్రం సీట్లను సైతం భర్తీ చేస్తామని తెలిపారు. కౌన్సెలింగ్‌లో జాయింట్‌ కన్వీనర్లు రంజిత్‌కుమార్‌, డాక్టర్‌ దత్తు, అడ్మిషన్స్‌ కమిటీ సభ్యులు హరికృష్ణ, సునీత, డాక్టర్‌ కుమార్‌ రాగుల, శ్రీకాంత్‌, రాకేశ్‌రె డ్డి, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, ఎస్బీఐ క్యాంపస్‌ బ్రాంచ్‌ అధికారులు పాల్గొన్నారు.

#Tags