BC Overseas Vidya Nidhi scholarship: విదేశీ విద్యకు రూ. 20 లక్షల సాయం, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

మహాత్మ జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం, ఈ విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించాలనే బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

విద్యార్థులు వీసా, పాస్‌పోర్ట్ కాపీతోపాటు, ఆధార్‌కార్డు, స్థానికత, కుల, ఆదాయ, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్‌కొరియా దేశాల్లో ఉన్నత విద్యావకాశం పొందినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. -GRE/GMAT, TOEFL/ IELTS /PTE రాసి మంచి స్కోర్లు సాధించిన వారికి 20శాతం వెయిటేజ్ కూడా ఉంటుంది.
 

అర్హత: బీసీ విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
వయస్సు: 35 ఏళ్లు దాటకూడదు
ఆదాయం: వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు మాత్రమే ఉండాలి.
డిగ్రీ: 60 శాతం మార్కులతో డిగ్రీ అర్హత పొంది ఉండాలి
వెబ్‌సైట్‌:  https://telanganaepass.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

#Tags