PG Applications: మ‌హిళా క‌ళాశాల‌లో పీజీ అడ్మిష‌న్స్

డిగ్రీ పూర్తి చేసిన యువ‌తుల‌కు పీజీ కోసం అడ్మిష‌న్స్ మొద‌లు పెట్టిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌. కాలేజీలో ల‌భించే కోర్సులు, త‌దిత‌రుల వివ‌రాల‌ను ప‌రిశీలించండి. ఆసక్తి గ‌ల వారు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి..
Post Graduation course admissions in Government College

సాక్షి ఎడ్యుకేషన్‌: స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీఆర్‌ జ్యోత్స్న కుమారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ జువాలజీ, కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, తెలుగు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి, అర్హత గల విద్యార్థినులు దరఖాస్తు చేయాలని సూచించారు.

Electric Rickshaws: ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా ఎల‌క్ట్రిక్ రిక్షాలు

పీజీలో ప్రవేశం పొందిన విద్యార్థినులకు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన అందుతాయని, వీటితో పాటు అర్హులైన విద్యార్థినులు ప్రతిభా ఉపకార వేతనాలు పొందవచ్చని తెలిపారు. హాస్టల్‌ వసతి, ల్యాబ్‌ సౌకర్యం, డిజిటల్‌ తరగతిగదులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థినులు ఆయా సబ్జెక్టుల వారీగా ప్రవేశాల కోసం జువాలజీ (9246452235), కెమిస్ట్రీ (9985904415), ఎకనామిక్స్‌ (9440830278) నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

#Tags