Induction program at NIT: క్యాంపస్‌, తదితర అంశాలపై అవగాహన

కాజీపేట అర్బన్‌: వరంగల్‌లోని నిట్‌లో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలు పొందిన నూతన విద్యార్థులకు నిట్‌ క్యాంపస్‌ను పరిచయం చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఇండక్షన్‌ ప్రోగ్రాం ఉత్సాహంగా సాగుతోంది.
విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ గజేంద్రనాథ్‌

ఈ నెల 4న బీటెక్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరిఝెంటేషన్‌ ప్రోగ్రాంను నిర్వహించి నిట్‌ను డైరెక్టర్‌ బిద్యాధర్‌సుబుదీ పరిచయం చేసి స్వాగతం పలికారు. 9వ తేదీ వరకు ఇండక్షన్‌ ప్రోగ్రాం పేరిట నిట్‌లోని తరగతి గదులు, ల్యాబ్స్‌, వర్కషాప్స్‌, వివిధ డిపార్ట్‌మెంట్లు, ఆడిటోరియం, కాన్ఫరెన్స్‌ హాల్స్‌ను పరిచయం చేస్తూనే ప్రతిరోజూ ఆర్ట్‌ ఆఫ్‌ మైండ్‌, ఆర్ట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ వర్క్‌, ఒత్తిడిని జయించేందుకు, యాంటీ ర్యాగింగ్‌, యాంటీ డ్రగ్స్‌పై నిట్‌ అధ్యాపకులతో పాటు నిష్ణాతులచే రోజు వారీగా సదస్సులను నిర్వహిస్తున్నారు.

TS ECET 2023లో అంద‌రి చూపు.. ఈ బ్రాంచ్ పైనే.. #sakshieducation

#Tags