CLAT Notification 2025 : లా కోర్సుల్లో ప్రవేశాలకు క్లాట్ నోటిఫికేషన్ విడుదల.. కోర్సులు, యూనివర్సిటీల వివరాలు..!

నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివ­ర్శిటీ.. యూజీ, పీజీ డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్శిటీలు ఆలిండియా స్థాయిలో ఏటా ఈ పరీక్షను నిర్వహి­స్తాయి. ఇందులో ర్యాంక్‌ సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
»    కోర్సులు: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా డిగ్రీ), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు (ఏడాది 
ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ).

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    ప్రవేశాలు కల్పించే యూనివర్శిటీలు: ఎన్‌ఎస్‌ఐయూ(బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్‌), ఎన్‌ఎల్‌ఐయూ(భోపాల్‌), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌(కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ(జోద్‌పూర్‌), హెచ్‌ఎన్‌ఎల్‌యూ(రాయ్‌పూర్‌), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్‌), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ(లక్నో), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్‌), సీఎన్‌ఎల్‌యూ(పాట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌(కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో(ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌(రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ(అసోం), డీఎస్‌ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ(తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ(ముంబై),  ఎంఎన్‌ఎల్‌యూ(నాగ్‌పూర్‌), ఎంఎన్‌ఎల్‌యూ(ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ(జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హర్యానా), ఎన్‌ఎల్‌యూటీ(అగర్తలా), జీఎన్‌ఎల్‌యూ(సిల్వస్సా).
»    అర్హత: యూజీ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.10.2024.
»    క్లాట్‌–2025 పరీక్ష తేది: 01.12.2024.
»    వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/

Anganwadi Jobs Notification 2024 Released : ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. 10, 7వ త‌ర‌గ‌తి అర్హతతోనే.. అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ విడుదల..

#Tags