World Bank Fellowshipకు 33 మంది ఎంపిక.. భారత్ నుండి ఒకరు ఎంపిక!

సాక్షి ఎడ్యుకేషన్: వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్‌కు తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి డి. కృష్ణ భాస్కర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్ & అనాలిటిక్స్ పై ప్రత్యేకమైన ఈ ఫెలోషిప్ కోర్సును ప్రపంచ బ్యాంకు గత సంవత్సరం ప్రారంభించింది.
  • MIT గ్రాడ్యుయేట్ కృష్ణ భాస్కర్ – మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ చదివిన సమయంలో చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగా ఈ గౌరవానికి ఎంపిక అయ్యారు.
  • 2,600 దరఖాస్తులలోనుంచి 33 మంది ప్రభుత్వ అధికారులను ఎంపిక, భారత్ నుండి కృష్ణ భాస్కర్ ఏకైక ప్రతినిధి.
  • ఫెలోషిప్‌లో భాగంగా వాషింగ్టన్ డీసీలో తొమ్మిది రోజుల ప్రత్యక్ష శిక్షణ అందుకోనున్నారు.
  • ఆరు నెలల కోర్సులో ప్రత్యేక శిక్షణతో పాటు డిజిటల్ కోర్సు కూడా ఉంటుంది.
  • మార్చి 18-27 మధ్య అమెరికాలో ప్రత్యక్ష కోర్సు నిర్వహించనున్నారు.
  • ప్రయాణ ఖర్చులన్నీ వరల్డ్ బ్యాంక్ భరిస్తుంది.

ఈ ప్రతిష్టాత్మక అవకాశాన్ని సాధించిన కృష్ణ భాస్కర్‌ను మార్చి 14న అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags