KNRUHS: యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్
వర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి– యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.
చదవండి: KNRUHS : కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్‌గా సంధ్యారాణి
జనవరి 16 ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 6గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసు కోవాలని, తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. అయితే అఖిల భారత కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్ వర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది. మరింత వివరాలకు www. knruhs.telangana.gov.in చూడాలని వెల్లడించింది.
చదవండి: ప్రైవేట్ ప్రాక్టీస్ కన్నా... ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు..