Acharya K Rammohan Rao: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

వన్ టౌన్ (విజయవాడపశ్చిమ): విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె. రామ్మోహనరావు అన్నారు.

కాకరపర్తి భావనారాయణ కళాశాల ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం ఆధ్వర్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన విజయాలను తెలియజేసే నమూనాలు, పలు అంశాలతో కూడిన ప్రదర్శనను ఆగ‌స్టు 27న‌ 'కాస్మో క్రూయిజ్' పేరుతో నిర్వహించింది.

ఆయన మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట నుంచి ఇటీవల పంపిన చంద్రయాన్-3 వరకు అద్భుత మైన విజయాలను సాధించిందన్నారు. విద్యార్థులు అబ్దుల్ కలామ్ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు.

చదవండి: Gaganyaan: అంతరిక్ష కేంద్రం మీదుగా గగన్‌యాన్‌.. అంతరిక్షంలోకి చేరిన తొలి భారతీయడు ఈయ‌నే..

కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు, హిందూ హైస్కూల్స్ కమిటీ విద్యాసంస్థల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ. విద్యార్థులు జీవితంలో అద్భుతమైన విజయాలను అందుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు అండగా ఉంటాయని వివరించారు.

ఇస్రో పంపిన ఉపగ్ర హాల నమూనాలు, శాస్త్రవేత్తల ప్రగతిని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు తరలివచ్చారు. ప్రిన్సిపాల్ కృష్ణవేణి అధ్యక్షత వహించారు. ఇస్రో బృంద సభ్యులు ఎం.అనీల్, శ్రీనివాసరావు, శ్రీని వాసరావు, కిషోర్ బాబు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆచార్యుడు వైద్యనాథన్ పాల్గొన్నారు.

#Tags