Free Legal Services: ‘లీగల్ ఎయిడ్’ను తెలుసుకోండి.. లీగల్ ఎయిడ్ సెంటర్ ద్వారా ఉచిత న్యాయం
సాక్షి, హైదరాబాద్: లీగల్ ఎయిడ్ సెంటర్ ద్వారా ఉచిత న్యాయం ఎలా పొందాలో, ఇంకా ఏం పథకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్‌పాల్ కోరారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్–2025)లో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆయన జనవరి 6న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ, రాష్ట్ర అథారిటీ అందిస్తున్న ఉచిత సేవలపై అవగాహన పొందాలని ప్రజలకు సూచించారు.
లోక్ అదాలత్‌లు, ఉచిత న్యాయ సాయం సహా పలు పథకాలను అథారిటీ అందిస్తోందని చెప్పారు. సత్వర న్యాయానికి బాటలు వేయడంలో అథారిటీ ముందుంటోందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక, రంగారెడ్డి జిల్లా జడ్జి ఎస్.శశిధర్‌రెడ్డి, అథారిటీ ఏవో జి.కళార్చన, జావేద్‌పాషా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
#Tags