PJTSAU: జయశంకర్‌ అగ్రి వర్సిటీకి జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు

సాక్షి, హైదరాబాద్‌: బోధన, పరి శోధన, విస్తరణ విభాగాల్లో చేప ట్టిన వినూత్న కార్యక్రమాల కు గాను ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు దక్కింది.

దేశవ్యాప్తంగా 145 వ్యవసాయ, అనుబంధ పరిశో ధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి. ఇందులో టాప్‌– 40 సంస్థలకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ తాజాగా ర్యాంకులను ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం 37వ ర్యాంకు సొంతం చేసుకుంది.

గతేడా ది ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ప్రకటించిన టాప్‌ 40 విద్యాసంస్థలలో వర్సిటీకి చోటు లభించలేదు. ఈ ఏడాది బోధన, పరిశోధనా, విస్తరణ కార్యక్రమాలను మెరుగుపర్చడంతో ఈ ర్యాంకు దక్కిందని విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

చదవండి: UG Course Admissions: ‘మనూ’లో యూజీకి దరఖాస్తుల ఆహ్వానం,చివరి తేదీ ఎప్పుడంటే..

బోధన కార్యక్రమాల్లో భాగంగా వర్సిటీ ద్వారా 2023–24 విద్యా సంవత్సరంలో ఆదిలాబాద్, తోర్నాలలో 60 మంది విద్యార్థులతో రెండు కొత్త వ్యవసాయ డిగ్రీ కళాశాలలను ప్రారంభించింది. నారాయణపేట్‌లో నూతన పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు, వివిధ డిగ్రీ కోర్సులలో సీట్ల సంఖ్యను 1,370కి పెంపుదల, వివిధ పంటలలో 8 నూతన వంగడాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదల చేసింది.

ఇందులో 5 రకాలను రాష్ట్రస్థాయిలో, 3 వంగడాలను జాతీయస్థాయి వెరైటల్‌ రిలీజ్‌ కమిటీ ఆమోదంతో విడుదల చేసింది.  

#Tags