Education: పేదల చదువులకు ప్రభుత్వం తోడ్పాటు

విశాఖ విద్య: భవిష్యత్‌ తరాల బాగు కోసమని విద్యరంగానికి అత్యంత పాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు, పత్రికలు చేస్తున్న దుష్ప్రచారాన్ని పలువురు విద్యావేత్తలు తీవ్రంగా తప్పుపట్టారు.

 ప్రభుత్వ బడులు నిర్వీర్యం చేయాలనే వారి కుట్రలు, పేద విద్యార్థులను చదువులకు దూరం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. విశాఖలోని ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో ‘ప్రగతి బాటలో రాష్ట్ర విద్యా వ్యవస్థ’ అనే అంశంపై సోమవారం చర్చా గోష్టి నిర్వహించారు.

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల మాజీ వైస్‌చాన్సలర్లు, ఆంధ్ర యూనివర్సిటీ వివిధ విభాగాల విశ్రాంత అధిపతులు, వర్సిటీలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫె సర్లు, నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన వి ద్యావేత్తలు, మేధావులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై కొంతమంది మేథావులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను వారి మాటల్లోనే...

చదవండి: 5th Class & Inter Admissions: గురుకులం సీవోఈలో ప్రవేశాలకు ఆహ్వానం

ప్రతీ విద్యార్థికి అవకాశాలు

నాణ్యమైన విద్యను అందించే విధంగా పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రపంచ స్థాయి సామర్థ్యాలను అందిపుచ్చుకునే విధంగా అందరికీ వనరులు, అవకాశాలను, నాణ్యమైన విద్య వ్యవస్థలను అందుబాటులో ఉంచారు. బడుల్లో ఐఎఫ్‌పీ ఫానెల్స్‌తో ప్రపంచం తరగతిలో ఆవిష్కృతమవుతోంది.
– ఆచార్య ఎం.జగన్నాథరావు, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మాజీ వీసీ

జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడు

గొప్ప విజన్‌ ఉన్న సీఎం జగన్‌. పాఠశాలల్లో డిజిట ల్‌ బోధన, కంటెంట్‌ అందించడం చారిత్రాత్మకం. ఇంగ్లిషు మీడియం చదువులు పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయి. మధ్యాహ్న భోజనం ఫలితంగా డ్రాపవుట్స్‌ తగ్గాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందుబాటులో ఉంచారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి.
– ఆచార్య హెచ్‌. లజపతిరాయ్‌, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పూర్వ వీసీ

అణగారిన వర్గాలు మళ్లీ బడిబాట

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగలో చేస్తున్న సంస్కరణలు ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాల పిల్లలు పాఠశాల బాట పడుతున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా విద్యను ఆస్తిగా ప్రతీ కుటుంబానికి అందించే దిశగా ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారు. నిజాలు తెలుసుకోకుండా కొంతమంది అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదు.
–ఆచార్య టి.షారోన్‌ రాజు, ఏయూ విద్యా విభాగాధిపతి

మానవ వనరుల అభివృద్ధి

దేశ అభివృద్ధికి మానవ వనరులు ఎంతో కీలకం. అభివృద్ధి చెందిన దేశాలను స్ఫూర్తిగా తీసుకొని, అదే తరహాలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన రెడ్డి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి దృక్పథం, పనితీరు మానవ వనరుల అభివృద్ధికి దోహదపడతాయి. నైపుణ్య చదువులతో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు కల్పించేందుకు కార్పోరేట్‌ సంస్థలు కాలేజీలకు వస్తున్నాయి.
–ఆచార్య కె.శ్రీరామ మూర్తి, ఏయూ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌

#Tags