Free Swayam Courses: ఉచిత కోర్సుల వేదిక.. స్వయం!.. స్వయం ప్రత్యేక కోర్సులు ఇవే..

నేటి వర్చువల్‌ లెర్నింగ్‌ యుగంలో నేర్చుకునేందుకు మార్గాలెన్నో! కూర్చున్న చోటు నుంచే మనకు నచ్చిన కోర్సులను పూర్తిచేసుకునే అవకాశం ఉంది. అది కూడా ఉచితంగానే! అంతేకాకుండా ఈ కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు కూడా లభిస్తుంది. అందుకు మార్గం.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వరంలోని స్వయం వేదిక (స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ మైండ్స్‌)!! స్వయం కోర్సులపై ప్రత్యేక కథనం...

ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వయం’ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. దీనిద్వారా ఇంజనీరింగ్, టెక్నాలజీ మొదలు హుమానిటీస్, సోషల్‌ సైన్సెస్, బిజినెస్, లా వంటి అనేక విభాగాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ కోర్సులను పూర్తి చేసుకోవచ్చు. 9వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుకేషన్‌ వరకూ.. అనేక కోర్సులను స్వయం ద్వారా అందిస్తున్నారు. దేశంలోని టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ల ఫ్యాకల్టీ రూపొందించిన ఈ కోర్సుల ద్వారా సబ్జెక్ట్‌ పరిజ్ఞానంతోపాటు విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు.

స్వయం ప్రత్యేకతలు ఇవే

  • స్వయం పోర్టల్‌ ద్వారా ఉచితంగా నాణ్యమైన కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. సర్టిఫికెట్‌ కోరుకునే వారు నామమాత్రంగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
  • నేర్చుకునే వారి సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సులను రూపొందించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఇంటర్నెట్‌ ఉంటే చాలు ఎక్కడి నుంచైనా తమకు వీలున్నప్పుడు నేర్చుకోవచ్చు. 
  • స్వయం అనేది ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌. కాబట్టి విద్యార్థులు కోర్సు మెటీరియల్‌ను ఇంటర్నెట్‌ ద్వారా ఉచితంగా పొందొచ్చు. అనేక స్వయం కోర్సులకు సర్టిఫికెట్‌ సైతం అందిస్తున్నారు. వీటికి ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు పరిశ్రమ వర్గాల్లోనూ గుర్తింపు ఉంది. ఇది జాబ్‌ మార్కెట్‌లో, ఉద్యోగ వేటలో ముందంజలో నిలిచేలా దోహదపడుతుంది. 
  • స్వయం కోర్సుల సమన్వయకర్తలు: ఏఐసీటీఈ, ఎన్‌పీటీఈఎల్, యూజీసీ, ఎన్‌సీఈఆర్‌టీ, ఐఐఎం బెంగళూరు, ఇగ్నో, ఎన్‌ఐఓఎస్‌(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌), సీఈసీ(కన్సోర్టియం ఫర్‌ ఎడ్యుకేషనల్‌ కమ్యూనికేషన్‌), ఎన్‌ఐటీటీటీఆర్‌(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌).
  • వెబ్‌సైట్‌: https://swayam.gov.in

జన వరిలో ప్రారంభమయ్యే కోర్సులివే

అడ్వాన్స్‌డ్‌ సీ ++

  • ఫ్యాకల్టీ: ఫ్రొఫెసర్‌ కన్నన్‌ మౌద్‌గాల్య(ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ఆఫ్‌ స్పోకెన్‌ ట్యుటోరియల్, ఐఐటీ బాంబే). 
  • ఏఐసీటీఈ రూపొందించిన ఫ్యాకల్టీ డవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌డీపీ) ఇది. 

ఇందులో మొత్తం 10 ఆడియో–వీడియో స్పోకెన్‌ ట్యుటోరియల్స్‌ ఉన్నాయి. దీనిద్వారా అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ ల్వాంగ్వేజ్‌ సీ++ను నేర్చుకోవచ్చు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో ఎంతో కీలకమైన సీ++ లాంగ్వేజ్‌కు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ కాన్సెప్ట్‌లను నేర్చుకునే అవకాశముంది. అభ్యర్థి ఆసక్తి, సమయం, సౌలభ్యం మేరకు ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా పూర్తిచేసుకోవచ్చు. 

చదవండి: Two New Courses : త్వ‌ర‌లోనే రెండు కోత్త కోర్సులు.. ఈ విద్యార్థుల‌కే..!

ఏఐ ఇన్‌ హుమాన్‌ రిసోర్సెస్‌(హెచ్‌ఆర్‌) మేనేజ్‌మెంట్‌ 

  • ఫ్యాకల్టీ: ప్రొఫెసర్‌ అబ్రహం సిరిల్‌ ఐజాక్‌(ఐఐటీ గౌహతి).
  • ఈ స్వయం కోర్సు ద్వారా ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)లో తాజా ట్రెండ్స్‌ను తెలుసుకోవచ్చు. హుమాన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఏఐ ప్రభావంపై అవగాహన పొందొచ్చు. ముఖ్యంగా హెచ్‌ఆర్‌ విభాగంలో నియామక ప్రక్రియ, మానవ వనరుల అభివృద్ధి, రిటెన్షన్‌లో ఏఐ పాత్రపై ఈ కోర్సు ద్వారా అవగాహన లభిస్తుంది. దీంతోపాటు ఏఐ ప్రవేశంతో మానవ వనరుల విభాగంలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల గురించి తెలుసుకునే అవకాశముంది. 
  • కోర్సు కాల వ్యవధి: 12 వారాలు
  • కోర్సు ప్రారంభం: 2025, జనవరి 20
  • కోర్సు ముగింపు: 2025, ఏప్రిల్‌11
  • దరఖాస్తుకు చివరి తేది: 2025, జనవరి 27
  • పరీక్షకు రిజిస్ట్రేషన్‌: 2025, ఫిబ్రవరి 14

అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్స్‌

  • ఫ్యాకల్టీ: ప్రొఫెసర్‌ అశీష్‌ దత్తా, ఐఐటీ కాన్పూర్‌.
  • రోబోటిక్స్‌ సిస్టమ్‌ డిజైన్, కంట్రోల్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, ఇండస్ట్రీ నిపుణుల కోసం ఈ అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్స్‌ కోర్సును రూ­పొందించారు. ఇందులో లింకేజెస్,వర్క్‌స్పేసెస్, ట్రాన్స్‌ఫర్మేషన్స్, కైనమేటిక్స్, ట్రాజెక్టరీ ప్లానింగ్, డైనమిక్స్‌ తదితర అంశాలను నేర్చుకోవచ్చు. 
  • కోర్సు కాల వ్యవధి: 12 వారాలు
  • కోర్సు ప్రారంభం: 2025, జనవరి 20
  • కోర్సు ముగింపు: 2025, ఏప్రిల్‌ 11
  • దరఖాస్తుకు చివరి తేది: 2025, జనవరి 27
  • పరీక్షకు రిజిస్ట్రేషన్‌: 2025, ఫిబ్రవరి 14

చదవండి: Job Opportunities with Five Courses : ఈ 5 కోర్సుల‌తో ఉపాధి అవ‌కాశాలు.. ఎక్క‌డంటే..!

ఎయిర్‌క్రాఫ్ట్‌ డిజైన్‌

  • ఫ్యాకల్టీ: ప్రొఫెసర్‌ ఏకే ఘోష్, ఐఐటీ కాన్పూర్‌.
  • ఎయిర్‌క్రాఫ్ట్‌ డిజైన్‌ కోర్సులో పూర్తిగా విమానం కాన్సెప్టువల్‌ డిజైన్‌ను పొందుపరిచారు.దీనిద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌ డిజైన్‌కు అవసరమైన వాటి నిర్వచనాల తోపాటు ప్రాథమిక స్థాయిలో సైజులు, కాన్ఫిగరేషన్‌ లేఅవుట్, అనాలసిస్, అప్టిమైజేషన్, ట్రేడ్‌ స్టడీస్‌ అంశాలపై అవగాహన పొందొచ్చు. 
  • కోర్సు కాల వ్యవధి: 12 వారాలు
  • కోర్సు ప్రారంభం: 2025, జనవరి 20
  • కోర్సు ముగింపు: 2025, ఏప్రిల్‌ 11
  • దరఖాస్తుకు చివరి తేది: 2025, జనవరి 27
  • పరీక్షకు రిజిస్ట్రేషన్‌: 2025, ఫిబ్రవరి 14
Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

కాన్‌స్టిట్యూషన్‌ లా అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌ ఇండియా

  • ఫ్యాకల్టీ: సాయి రామ్‌ భట్, నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ.
  • దేశంలో రాజ్యాంగం, చట్టాలు, ప్రజా పాలనపై అన్ని విభాగాల విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కోర్సును రూపొందించారు. దీనిద్వారా కాన్‌స్టిట్యూషనల్‌ లా, పబ్లిక్‌ అడ్మిషన్‌పై అవగాహన పెంచుకోవచ్చు. 
  • కోర్సు కాల వ్యవధి: 12 వారాలు
  • కోర్సు ప్రారంభం: 2025, జనవరి 20
  • కోర్సు ముగింపు: 2025, ఏప్రిల్‌ 11
  • దరఖాస్తుకు చివరి తేది: 2025, జనవరి 27
  • పరీక్షకు రిజిస్ట్రేషన్‌: 2025, ఫిబ్రవరి 14

కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌ 

  • ఫ్యాకల్టీ: డాక్టర్‌ సలియా రెక్స్, సెయింట్‌ పౌల్స్‌ కాలేజీ, కలామసర్రీ.
  • ఈ కోర్సును ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌పై సంపూర్ణ అవగాహన కలిగించేలా రూపొందించారు. ఇంగ్లిష్‌ నేర్చుకోవడంలో కీలకమైన నాలుగు నైపుణ్యాలు రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా రిటెన్, స్పోకెన్‌ కమ్యూనికేషన్‌లో ఇంగ్లిష్‌ను ఒక పరికరంగా ఎలా ఉపయోగించాలి, ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించడం, దైనందిన జీవితంలో ఇంగ్లిషను సమయోచితంగా ఉపయోగించడం గురించి ఈ కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు.
  • కోర్సు కాల వ్యవధి: 12 వారాలు
  • కోర్సు ప్రారంభం: 2025, జనవరి 13
  • కోర్సు ముగింపు: 2025, ఏప్రిల్‌ 13
  • దరఖాస్తుకు చివరి తేది: 2025, జనవరి 28
  • పరీక్షకు రిజిస్ట్రేషన్‌: 2025, ఫిబ్రవరి 28

ఏఐ ఫర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 

  • ఫ్యాకల్టీ: ప్రొఫెసర్‌ అభినవ త్రిపాఠీ,ఐఐటీ కాన్పూర్‌
  • పెట్టుబడుల రంగంలో భవిష్యత్‌ అనలిస్టులు, ట్రేడర్లు, బ్రోకర్లు, కన్సల్టెంట్లు, ఇతర పరిశ్రమ నిపుణులకు ఉపయోగపడేలా ఏఐ ఫర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కోర్సును రూపొందించారు. ఇప్పటికే ఈ రంగంతో పరిచయం ఉన్న వారితోపాటు తమ వృత్తిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్‌ కీలకంగా మారుతుందని భావిస్తున్న వారి కోసం ఈ కోర్సును రూపొందించారు. 
  • కోర్సు కాల వ్యవధి: 12 వారాలు
  • కోర్సు ప్రారంభం: 2025, జనవరి 20
  • కోర్సు ముగింపు: 2025, ఏప్రిల్‌ 11
  • దరఖాస్తుకు చివరి తేది: 2025, జనవరి 27
  • పరీక్షకు రిజిస్ట్రేషన్‌: 2025, ఫిబ్రవరి 14

అప్రిసియేటింగ్‌ హిందుస్తానీ మ్యూజిక్‌ 

  • ఫ్యాకల్టీ: ప్రొఫెసర్‌ లక్ష్మీ శ్రీరామ్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అహ్మదాబాద్‌ యూనివర్సిటీ.
  • ఈ కోర్సు ప్రధానంగా ప్రస్తుత అనుసరిస్తున్న విధానాలపై దృష్టిసారిస్తుంది. దీంతోపాటు చారిత్రక, మేథో కోణాలను కూడా చర్చిస్తుంది. ముఖ్యంగా ప్రముఖ సంగీతకారులు, పరిశోధకుల అభిప్రాయాలను పొందుపరుస్తుంది. ఈ కోర్సులో భాగంగా లైవ్‌ డెమానిస్ట్రేషన్స్‌తోపాటు రికార్డు చేసిన సంగీతాన్ని వినడం తదితర అంశాలు ఉంటాయి. 
  • కోర్సు కాల వ్యవధి: 8 వారాలు 
  • కోర్సు ప్రారంభం: 2025, జనవరి 20
  • కోర్సు ముగింపు: 2025, మార్చి 14
  • దర ఖాస్తుకు చివరి తేది: 2025, జనవరి 27
  • పరీక్షకు రిజిస్ట్రేషన్‌: 2025, ఫిబ్రవరి 14

#Tags