ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, హాస్పిటాలిటీలదే జోరు

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో విభిన్నరంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగైనట్టుగా వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

గతేడాదితో పోల్చితే మొదటి 4 నెలల్లో 31 శాతం జాబ్‌ పోస్టింగ్స్‌ పెరిగినట్టు వెల్లడైంది. ఉద్యోగ అవకాశాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నట్టు తేలింది.

చదవండి: Amazon Employees Struggle: అమెజాన్‌ ఉద్యోగులకు ఎంత కష్టం? జీతాలు సరిపోక అవస్థలు

దేశవ్యాప్తంగా ఆర్థికరంగం తిరిగి పుంజుకోవడంతోపాటు, జాబ్‌ సెక్టార్‌ల పురోగతితో జాబ్‌ మార్కెట్‌ పుంజుకుంటున్నదని జాబ్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అప్నా.కో తాజా అధ్యయనం వెల్లడించింది. 

  • ఈ–కామర్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), హాస్పిటాలిటీలదే జోరు అని అప్నా.కో నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఈ–కామర్స్‌ 21 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 17 శాతం, హాస్పిటాలిటీ రంగాల్లో 13 శాతం మేర ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు తెలిపింది.  
  • సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, బ్రాండ్, మార్కెటింగ్, కస్టమర్‌ సపోర్ట్‌ డొమైన్‌లలో వృత్తి నిపుణులకు డిమాండ్‌ గణనీయంగా పెరిగినట్టుగా పేర్కొంది. దక్షి ణాది రాష్ట్రాల్లో ఈ రంగాల్లో 23 శాతం వృద్ధి నమోదైనట్టుగా, ఆయా రంగాల్లో జాబ్‌ పోస్టింగ్‌ల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ముందువరుసలో నిలుస్తున్నట్టుగా తెలిపింది.  
  • లక్‌నవూ, కోయంబత్తూరు, గ్వాలియర్‌ వంటి రెండో, మూడో శ్రేణి నగరాల్లో నూ డిజిటలైషన్‌ అమలు చేస్తుండడంతో ఆయా నగరాల్లోనూ జాబ్‌పోస్టింగ్స్‌ పెరుగుతున్నాయని చెప్పింది.  
  • తమ కంపెనీకి సంబంధించినంత వరకు చూసినా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కొత్తగా ఉద్యోగార్థుల (ఫ్రెష్‌ అప్లికెంట్స్‌) నుంచి ‘జాబ్‌అప్లికేషన్లు’21 శాతం పెరిగినట్టు, వారిలో మహిళలే 18 శాతం ఉన్నట్టుగా ఈ సంస్థ తెలిపింది. గతేడాదితో పోల్చితే 2024లో జనవరి–ఏప్రిల్‌ల మధ్య జాబ్‌ అప్లికేషన్స్‌ 15 శాతం పెరుగుదల నమోదైనట్టు (1.7 కోట్లు పెరుగుదల) అప్నా.కో ఈ నివేదికలో పేర్కొంది.  

#Tags