సికింద్రాబాద్‌ కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌కు ‘President of Colors’ అవార్డు

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌కు అరుదైన గౌరవం దక్కింది.

అత్యుత్తమ సేవలందించే సైనిక సంస్థలకు ఇచ్చే ప్రెసిడెంట్‌ కలర్స్‌ అవార్డుకు కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ (సీడీఎం) ఎంపికైనట్టు మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు. వచ్చే వారంలో ఢిల్లీలో ఈ అవార్డు ప్రదానోత్సవం ఉంటుందని, సాయుధ సంస్థలకు ఇచ్చే అత్యున్నత గౌరవం ఇదని వారు వెల్లడించారు.

చదవండి: TSPSC Group 2 Exam Breaking News 2024 :తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌–2 పేప‌ర్-1 కఠినం.. పేపర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ మధ్యస్థం.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

భారత సేనకు సంబంధించిన మూడు సాయుధ బలగాల్లోని ఉన్నతాధికారులకు యుద్ధతంత్రాలు, నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న భద్రత సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలపై శిక్షణ ఇచ్చేందుకు సికింద్రాబాద్‌లో ఈ సీడీఎంను 1970లో స్థాపించారు. అప్పటి నుంచి ఎంతో మంది అధికారులకు శిక్షణ అందించడం ద్వారా భారత సేనలను బలోపేతం చేయడంలో సీడీఎం కీలక పాత్ర పోషించింది. ఇందుకు గుర్తింపుగానే ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్‌ కలర్స్‌ అవార్డు దక్కినట్టు అధికారులు తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags