Private Colleges: ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ ప్రారంభం.. దీంతో ఈ ప్రవేశాలు నిలిచిపోయాయి..
దీంతో పీజీ రెండో విడత ప్రవేశాలు నిలిచిపోయాయి. అయితే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. కాగా, ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌కు తెలంగాణ రిపబ్లికన్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బోయ రమేశ్ మద్దతు ప్రకటించారు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థల బంద్: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవ డంతో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ పిలుపుమేరకు ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థలను బంద్ చేసినట్టు అసోసియేషన్ ఖమ్మం జిల్లా బాధ్యులు పి.ఉపేందర్‌రెడ్డి, ఎం.ప్రభాకర్‌రెడ్డి, వేణుమాధవ్ తెలి పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో కళాశాలలు మూతపడ్డాయని చెప్పారు. బకాయిలు విడుదల చేసే వరకు బంద్ పాటిస్తామని వారు వెల్లడించారు.