ITI Colleges Admissions 2024 : ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
విద్యార్థులు జూన్ 10 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
తక్కువ వ్యవధిలో..
స్వయంఉపాధి రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఐటీఐ కోర్సులు వరం లాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను సంస్థ ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం ఉన్న ఆర్టీసీ అధికారులతో తరగతులను నిర్వహిస్తోంది.
కోర్సులు :
ఈ ఐటీఐ కళాశాలల్లో మోటార్ మెకానిక్ వెహికిల్ (రెండేళ్లు), మెకానిక్ డీజిల్ (ఏడాది), వెల్డర్ (ఏడాది), పెయింటర్ (రెండేళ్లు) ట్రేడ్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు.
అర్హతలు ఇవే..
మోటార్ మెకానిక్ వెహికల్, డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లకు పదో తరగతి అర్హత ఉండాలి. మిగతావాటికి ఎనిమిదో తరగతిని విద్యార్హతగా నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
☛ Engineering: ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎక్కువ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి? ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులేంటి?
మీకు కావాల్సిన సమాచారం కోసం..
ఈ ట్రేడ్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 ద్వారా మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చును.
☛ EAMCET Counselling 2024 : ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈ ఏడాది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం .....