Success Story: ట్యూషన్లు చెప్పుతూ.. రిసెప్షనిస్టుగా ప‌నిచేస్తూ.. ఐపీఎస్ అయ్యానిలా..

కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని ఎంతోమంది నిరూపించారు. పేదింటిలో పుట్టిన ప్రతిభతో అనుకున్నది సాధించినవారు ఎంతోమంది.
Pooja Yadav IAS

అంగవైకల్యం ఉన్నా..పట్టుదలతో తమలోని ప్రతిభను చాటి చెప్పారు ఇంకెంతోమంది. ఇలా ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ స్ఫూర్తిప్రదాతలుగా మారొచ్చనీ మరో అమ్మాయి నిరూపించింది. ‘హాలో సార్’..అని వచ్చిన అతిథుల్ని వినంగా పలకరించే రిసెప్షనిస్ట్ స్థాయి నుంచి..సెట్యూట్ కొట్టించుకునే ఐపీఎస్‌(IPS) ఆఫీసర్ స్థాయికి ఎదిగారు హర్యానాకి చెందిన పూజా యాదవ్. ఎన్నో కష్టాలను ఎదుర్కొని యూపీఎస్సీ  ఎగ్జామ్స్‌లో విజయం సాధించి..తన కలను నెరవేర్చుకుని ఐపీఎస్‌ ఆఫీసర్ అయ్యారు. పూజా యాదవ్ సక్సెస్‌ ఫుల్‌ స్టోరీ మీకోసం..

చ‌దువు.. ఉద్యోగం..


హర్యానాలో ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేసిన పూజాయాదవ్..బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశారు. ఎంటెక్ చేయటానికి చాలా కష్టపడ్డారు ఆర్థికంగా. అలా ఎలాగోలాగా బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలో… ఎంటెక్ పూర్తి చేశాక కొన్నేళ్లు కెనడా, జర్మనీలో పని చేశారు. కానీ ఏం చదివినా..ఏ జాబ్ చేసినా ఆమెకు సంతృప్తినివ్వలేదు. కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కానీ ఐపీఎస్‌ అవ్వాలనే కలను మాత్రం మరచిపోలేదు. 

Inspirational Story: ఈ ఉద్యోగం వెనుక పెద్ద‌ పోరాటమే.. బుక్స్ కొన‌డానికి కూడా..

ఆ వెంటనే ఉద్యోగం వదిలేసి..
ఉద్యోగం చేసే సమయంలో తాను విదేశాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాననీ, ఇండియా కోసం చేయట్లేదనీ గుర్తించారు. అంతే వెంటనే ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చారు. ఐపీఎస్‌ అవ్వాలనే కలను నెరవేర్చుకోవటానికి ఇండియాలో అడుగు పెట్టిన పూజాకు యూపీఎస్సీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ కాస్త కష్టమే అయ్యింది. ఎందుకంటే కొంతకాలం చదువుకు దూరంగా ఉద్యోగంలోనే ఉండిపోయారు కాబట్టి.

ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్స్ రాసినా..

ఇండియా వచ్చాక పూజా యాదవ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎగ్జామ్స్ (సివిల్స్) రాయాలని అనుకున్నారు. దాని కోసం చాలా కష్టపడ్డారు. అదో తపస్సులా భావించారు. ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్స్ రాసినా విజయం సాధించలేకపోయారు. దీంతో మరింత పట్టుదలతో మరోసారి యత్నించి ఎలాగైనా సరే అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశంపై సాధన చేశారు. మెళకువల నేర్చుకున్నారు. దానికి చక్కగా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఓ క్రమ పద్ధతిలో చదివారు. అలా రెండోసారి ఎగ్జామ్స్ రాసి విజయం సాధించారు. 2018 కేడర్‌లో  ఐపీఎస్‌(IPS) గా నియమితులయ్యారు.

కుటుంబం ఆర్థికంగా అంత బలమైనదేమీ కాదు.. కానీ


ఎలాగైతేనే పూజా యాదవ్ ఐపీఎస్‌(IPS) అయ్యారు. కానీ అది అనుకున్నంత తేలికగా అవ్వలేదు. పైగా ఎంతో తేలిగ్గా కనిపిస్తున్నా..  తన కల నెరవేర్చుకోవటానికి ఆమె చాలా చాలా కష్టపడ్డారు. పూజా కుటుంబం ఆర్థికంగా అంత బలమైనదేమీ కాదు. చదువుకి అయ్యే ఖర్చుల కోసం ఆమె చాలా కష్టాలు పడ్డారు. కుటుంబంలో అందరూ ఉద్యోగం వదిలి వచ్చి తిరిగి చదువుకోవాలనే ఆమె కోరినకు మద్దతుగా నిలిచారు. అందరి సహకారం అయితే ఉందిగానీ ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బు పెద్ద సమస్య అయ్యింది. ఎంటెక్ చదవడానికీ, విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లడానికీ పూజా యాదవ్ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ సివిల్స్‌కు చదవాలంటే మరింత డబ్బు కావాల్సి రావడంతో.. చేతిలో సరిపడా డబ్బులు లేక పిల్లలకు ట్యూషన్లు చెప్పటం.. రిసెప్షనిస్టుగా కూడా పనిచేసి ఆ డబ్బులు సమకూర్చుకుని ఖర్చు పెట్టుకుని ప్రిపేర్ అయ్యారు.

వివాహాం:


UPSC చదవాలంటే కష్టపడాలి. అదో తపస్సులా భావించారు. పట్టుదల పెంచుకోవాలి. అదృష్టం కంటే… కష్టాన్ని నమ్ముకోవాలి. అప్పుడే విజయం వరిస్తుంది.. అనుకున్నది సాధిస్తారని తెలిపారు. నిరాశ ఎదురైందని లక్ష్యాలను సాధించటం మానుకోకూడదు. ఏకాగ్రతను వదలకూడని అప్పుడే అనుకున్నది సాధిస్తారని పూజా యాదవ్ తెలిపారు. పూజా యాదవ్ ఐఏఎస్ ఆఫీసర్ వికల్ప్ భరద్వాజ్‌ను ఫిబ్రవరి 18,2021న వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ భార్యాభర్తలు కాకముందు ముస్సోరీలో సివిల్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో తొలిసారి కలిశారు. పూజా భర్త వికల్ప్ 2016 బ్యాచ్. కేరళ కేడర్. పెళ్లి తర్వాత… పూజ కోసం ఆయన గుజరాత్ కేడర్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యారు.

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

#Tags