IPS Officer Real Story : మా నాన్న కోసం ఐపీఎస్ కొట్టానిలా.. కానీ.. నా ల‌క్ష్యం మాత్రం ఇదే..

చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ బిడ్డ‌లు ఐఏఎస్‌, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సాధించాలని క‌ల‌లు కంటుంటారు. ఇందుకోసం త‌మ‌ పిల్ల‌ల‌ను ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివిస్తుంటారు. స‌రిగ్గా ఇలాంటి స్టోరీనే నిచికేత్‌ షలేకే ది. నేను ఐపీఎస్‌ కావాలన్నది మా నాన్న కల.

అందుకే ఎంతో ఇష్టంతో కష్టపడి ఐపీఎస్‌ సాధించాన‌ని గుంటూరు ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏఎస్పీ) నిచికేత్‌ షలేకే చెప్పారు. ఈ నేప‌థ్యంలో నిచికేత్‌ షలేకే ఐపీఎస్సీ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
మహారాష్ట్రలోని పూణే సమీపంలోని ప్రింళై మా స్వగ్రామం. మా తల్లిదండ్రులు విశ్వనాథ్‌, చంద్రసేన ఇద్దరూ ఉపాధ్యాయులే. మేము ఇద్దరం సంతానం. నేను పెద్దవాడిని. తమ్ముడు సివిల్‌ ఇంజినీర్‌. నా చిన్నప్పటి నుంచే నేను ఐపీఎస్‌ కావాలని నాన్న కలలు కనేవారు.

☛ IAS Success Story : మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ 2వ‌ ర్యాంక్ కొట్టా.. క‌లెక్ట‌ర్ అయ్యా.. కానీ నా భ‌ర్త..

ఎడ్యుకేష‌న్ :
నా చదువు అంతా పట్ణణంలోనే  పూర్తయింది. మా గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళి చదువుకునేవాడిని. ఐపీఎస్‌ కోసం ఎంతో కష్టపడ్డాను. ముందు రెండుసార్లు సివిల్స్‌కు యత్నించి విఫలమయ్యాను. అయినా పట్టుదల విడిచి పెట్టలేదు. కచ్చితంగా ఐపీఎస్‌ సాధించి తీరాలని 2019లో ప్రయత్నించి సెలెక్ట్‌ అయ్యాను.

☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ త‌ర్వాత ఉచితంగా

ఐపీఎస్‌ సెలెక్ట్ అయిన‌ కొద్ది రోజులే..
ఐపీఎస్‌ సెలెక్ట్‌ అయ్యాక కొద్ది రోజుల పాటు అకాడమీ, ఒడిశాల్లో శిక్షణ పొందాను. విధులు, బాధ్యతల గురించి తెలుసుకున్నాను. నాకు తొలి పోస్టింగ్‌ గుంటూరులోనే రావడం ఆనందంగా ఉంది. గుంటూరు ఈస్ట్‌ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టా. నేరాల నియంత్రణకు కృషి చేస్తా. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాం. చోరీల నియంత్రణకు చర్యలు చేపడతాం. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజలు నన్ను నేరుగా కలవచ్చు. నా కార్యాలయంలో నిత్యం అందుబాటులో ఉంటా. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

➤☛ UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

#Tags