UPSC Civil Prelims Results 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితా విడుదలయ్యింది. దేశ వ్యాప్తంగా జూన్‌16న ప్రిలిమ్స్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే జులై1న యూపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. అయితే అప్పుడు అభ్యర్థుల హాల్‌టికెట్‌ నెంబర్లను మాత్రమే ప్రకటించింది. తాజాగా మెయిన్స్‌ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ రిలీజ్‌ చేసింది.

SBI Circle Based Officer Final Results Out: ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

సివిల్స్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం  13.4 లక్షల మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వారిలో  14,627 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మెయిన్స్‌కు ‍క్వాలిఫై అయినవారు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ పేరును  ఇలా పరిశీలించుకోండి. 


UPSC Civil Prelims Results 2024 with names Declared

 

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ upsc.gov.in ను క్లిక్‌ చేయండి.
  • Civil Services Preliminary Result with name అనే లింక్‌పై క్లిక్‌ చేయండి.
  • తర్వాతి పేజీలో రిజల్ట్‌ అనే లింక్‌ కనిపిస్తుంది..దాన్ని క్లిక్‌ చేయండి
  • మీ పేరు, రూల్‌ నెంబర్‌ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి

#Tags