Civil Engineering: యూనివర్సిటీలో 'ప్రతిష్ట 2024' పేరుతో టెక్నికల్‌ సింపోజియం

ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో నిర్వహించిన రెండురోజుల జాతీయస్థాయి టెక్నికల్‌ సింపోజియం ను జేఎన్‌టీయూ జీవీ వీసీ ప్రొఫెసర్‌ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన విద్యార్థులను ప్రోత్సాహిస్తూ మాట్లాడారు..

 

విజయనగరం అర్బన్‌: ఇంజినీరింగ్‌ రంగంలో సివిల్‌ కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ఉన్న వారే రాణిస్తారని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కె.వెంకటసుబ్బయ్య అన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాల సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో స్థానిక యూనివర్సిటీలో ‘ప్రతిష్ట 2024’ పేరుతో రెండురోజుల పాటు జరిగిన జాతీయస్థాయి టెక్నికల్‌ సింపోజియంను బుధవారం ఆయన ప్రారంభించారు.

APPSC Group-1 Mains Cancelled: ఏపీపీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై కోర్టు తీర్పు

ఈ సందర్భంగా మాట్లాడుతూ సివిల్‌ ఇంజనీరింగ్‌ ఎల్లప్పుడూ రాయల్‌ సివిల్‌గా నిలుస్తుందన్నారు. నేర్చుకున్న, చదువుకున్న విద్యతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ను పెంపొందించుకోవాలని సూచించారు. నైపుణ్యం మెరుగుపరుచుకుంటే మంచి అవకాశాలు వస్తాయని అభిప్రాయ పడ్డారు. గౌరవ అతిథిగా హాజరైన రాజీవ్‌ గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయుకేటీ) ఎచ్చెర్ల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేవీజీడీ బాలాజీ మాట్లాడుతూ ఇలాంటి సింపోజియంలకు విద్యార్థులు హాజరైతే వారి మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ మెరుగవుతాయన్నారు. అనంతరం ముఖ్యఅతిథులను సత్కరితంచారు.

AI Software Engineer: ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ‘డెవిన్‌’.. వెబ్‌సైట్‌ రెడీ!

సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.శ్రీనివాసప్రసాద్‌ అధ్యక్షతన జరిగన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.శ్రీకుమార్‌, టెక్నికల్‌ సింపోజియం ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్లుగా ఆర్‌.బాలమురళీకృష్ణ, టీఎస్‌డీ ఫణీంద్రనాథ్‌, స్టూడెంట్‌ కో ఆర్డినేటర్లుగా ఎన్‌.లతీఫ్‌కుమార్‌, వై.తిరుమలదేవి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags