Beuro of indian Standards Jobs 2024 : బ్యురో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్‌లో 345 ఉద్యోగాలు...

సాక్షి ఎడ్యుకేష‌న్‌: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో డైరెక్ట్ ప్రాతిపదికన 345 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాల‌కు సెప్టెంబ‌ర్ 30వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.

ప్రాక్టికల్ అసెస్మెంట్, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్, ఇంటర్య్వూల ఆధారంగా ఎంపిక చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్, హిందీ, మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ, కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, ఫ్లంబర్, ఎలక్ట్రిషియన్, వైర్ మాన్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

345 పోస్టుల ఖాళీల వివరాలు ఇవే...:
➤☛ అసిస్టెంట్ డైరెక్టర్ : 03
➤☛ పర్సనల్ అసిస్టెంట్ : 27
➤☛ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 43
➤☛ అసిస్టెంట్ : 01
➤☛ టెక్నికల్ అసిస్టెంట్ : 27
➤☛ స్టెనోగ్రాఫర్ : 19
➤☛ సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ : 128
➤☛ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ : 78
➤☛ సీనియర్ టెక్నీషియన్ : 18
➤☛ టెక్నీషియన్ : 01

పూర్తి వివ‌రాల‌కు.. www.bis.gov.inలో చూడొచ్చు

#Tags