Village Success Story : ఈ గ్రామంలో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌, జడ్జీ ఉద్యోగాల‌తో పాటు.. ఇంకా ఎంద‌రో .. ఒకప్పుడు ఈ ఊరిలో దారుణంగా..!

దొంగతనాలు, దోపిడిలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్‌ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే వామ్మో అనుకునేవారు. ఇప్ప‌డు ఈ గ్రామం పూర్తిగా మారిపోయింది.

దీనికి కార‌ణం ఒక అమ్మాయి. ఎలా అంటే.. గ్రామం నుంచి మొట్ట‌మెద‌టిగా అభిలాష జెఫ్ అనే అమ్మాయి జడ్జీ ఉద్యోగం సాధించింది. ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్‌ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో అభిలాష, ఈ గ్రామం స‌క్సెస్ స్టోరీ మీకోసం.. 

ఏదో ఒకరోజు మా అమ్మాయిని..
ఇప్ప‌డు.. ఆ గ్రామం అభిలాష చూసి.. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.  ఈ గ్రామంకు చెందిన‌ సరితా మీనా అనే ఓ త‌ల్లి...మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుందంటుంది. అలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఈ గ్రామంలో ఎంద‌రో ఉన్నారు. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్‌ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్‌ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్‌ మోడల్ అయింది.

☛ Success Story : ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ..

అమ్మాయిల‌కు ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చాలా.. అనే వారు ఇప్పుడు..
అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది అంటుంది కర్ణిక అనే  గృహిణి.

ఇలాగే ఈ గ్రామం నుంచి ఐపీఎస్ ఉద్యోగానికి..

ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్‌ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్‌ను ఇప్పుడు ఐఏఎస్‌ ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్‌లు కలర్‌ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్‌ సెంటర్‌ల వారు అంటించిన ఈ పోస్టర్‌లలో ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు అని ఉంటుంది.

ఇప్పుడు ఈ గ్రామం మ‌రో గొప్ప‌త‌నం ఇదే..
ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్‌ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం బాలికల పాఠశాలతో కలిసి మూడు స్కూల్స్‌ ఉన్నాయి. చదువు వల్ల నయాబస్‌ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.

ఉద్యోగాలలోనే.. ఆటల్లోనూ..

ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్‌లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్‌ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది.

మరోసారి నయాబస్‌ గ్రామం విషయంలో..
చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్‌ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు.

➤☛ Jaya Sucess Story: వ్యవసాయ కుటుంబం​.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన జయ

#Tags