CDS Examination Notification : కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల తేదీ.. అర్హ‌త‌లు ఇవే!

త్రివిధ దళాల్లో పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకు హోదాలో అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించే పరీక్ష.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.

➔    సీడీఎస్‌ఈ(1)నోటిఫికేషన్‌: 2024,డిసెంబర్‌ 11
➔    దరఖాస్తు చివరి తేదీ: 2024, డిసెంబర్‌ 31;
➔    పరీక్ష తేదీ: 2025, ఏప్రిల్‌ 13.
➔    సీడీఎస్‌ఈ (2) నోటిఫికేషన్‌: 2025, మే 28; 
➔    దరఖాస్తు చివరి తేదీ: 2025, జూన్‌ 17;
➔    పరీక్ష తేదీ: 2025, సెప్టెంబర్‌ 14
➔    త్రివిధ దళాల్లో పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకు హోదాలో అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించే పరీక్ష.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఈ పరీక్షను ప్రతి ఏటా రెండు సార్లు సీడీఎస్‌–1, సీడీఎస్‌–2 పేరుతో నిర్వహిస్తారు. ఇండియన్‌ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్‌); ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఎజిమలా); ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(హైదరాబాద్‌); ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (చెన్నై) (పురుషులు, మహిళలు)లలో శిక్షణ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

PG Common Entrance Test 2024: పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.57 శాతం పాస్‌..ఈనెల 12 నుంచి కౌన్సెలింగ్‌

సీడీఎస్‌ఈ అర్హతలు
➔    ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలకు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. నేవల్‌ అకాడమీకి దరఖాస్తు చేసుకునేందుకు బీటెక్‌/బీఈ ఉత్తీర్ణులవ్వాలి. 
➔    ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివుండాలి.దరఖాస్తు తేదీ నాటికి చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే.
రెండు దశల్లో ఎంపిక
➔    త్రివిధ దళాల్లో ఆఫీసర్‌ కేడర్‌ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలుత యూపీఎస్సీ సీడీఎస్‌ఈ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిస్తే.. మలిదశలో ఆయా దళాలకు చెందిన సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌లు ఇంటర్వ్యూ నిర్వహిస్తాయి. 
➔    తొలిదశ రాత పరీక్ష.. రెండు విధాలుగా ఉంటుంది. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
➔    ఇండియన్‌ మిలిటరీ,నేవల్, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలకు సంబంధించి ఇంగ్లిష్‌ 100 మార్కు­లు, జనరల్‌ నాలెడ్జ్‌ 100మార్కులు,ఎలిమెంట­రీ మ్యాథమెటిక్స్‌ 100 మార్కులకు ఉంటాయి. 
➔    ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీకి సంబంధించి ఇంగ్లిష్‌ 100 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ 100 మార్కులకు నిర్వహిస్తారు.

UPSC Job Calender : 2025 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన యూపీఎస్‌సీ.. ఈ అర్హతతోనే పలు ఉద్యోగాలకు సిద్ధమయ్యే అవకాశం!

ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ
రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు తదుపరి దశలో.. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి టెస్టులను 6 రోజులపాటు నిర్వహిస్తారు. ఆయా సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించే ఎంపిక ప్రక్రియ 300 మార్కులకు ఉంటుంది. పలు రకాల పరీక్షలు, చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటి ద్వారా ఆఫీసర్‌ ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాలున్న అభ్యర్థులను ఖరారు చేస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు ఖరారు చేస్తారు. 

Muhammad Yunus: బంగ్లాదేశ్‌ సారథిగా మహ్మద్ యూనుస్‌

#Tags