CDS (2) 2024 Notification: ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉద్యోగాలకు సీడీఎస్‌ఈ (2) నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎ­స్సీ).. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉద్యోగాలకు కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహి­త పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

పోస్టుల వివరాలు

»    మొత్తం పోస్టుల సంఖ్య: 459
»    ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్‌–100.
»    ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల–32.
»    ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్‌–32.
»    ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, చెన్నె(మద్రాస్‌), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌–276.
»    ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, చెన్నై(మద్రాస్‌), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్‌ నాన్‌ టెక్నికల్‌–19.
»    అర్హత: మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నేవల్‌ అకాడమీ ఉద్యోగాలకు ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఎయిర్‌ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివి ఉండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్ష రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
»    వయసు: ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీలకు 02.07.2001 కంటే ముందు, 01.07.2006 తర్వాత జన్మించినవారు అర్హులు. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ పోస్టులకు 02.07.2001 కంటే ముందు, 01.07.2005 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ పోస్టులకు 02.07.2000 కంటే ముందు, 01.­07.2006 తర్వాత జన్మించినవారు అనర్హులు.
»    ఎంపిక విధానం: రెండు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధార ంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు. ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు కాల వ్యవ«ధి 2 గంటలు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమి(ఓటీఏ)పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.06.2024.
»    దరఖాస్తు సవరణ తేదీలు: 05.06.2024 నుంచి 11.06.2024వరకు
»    పరీక్ష తేది: 01.09.2024.
»    తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
»    వెబ్‌సైట్‌: https://upsc.gov.in

TS Inter Supplementary Exam 2024: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి .....

#Tags