CBSE Class 10th And 12th Results: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ద్వారా రిజల్ట్‌ ఇలా తెలుసుకోండి

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను త్వరలోనే విడుదల చేయనుంది. గతేడాది మే 12న ఫలితాలను విడుదల చేశారు. ఈసారి మే నెలలోనే ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఫలితాల కోసం అఫీషియల్‌ వెబ్‌సైట్‌  cbse.gov.in లేదా cbse.nic.inలో అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు.  మీ రోల్ నంబర్, పాఠశాల సంఖ్య మరియు పుట్టిన తేదీ వివరాలతో రిజల్ట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఒకేసారి 10, 12వ తరగతి ఫలితాలు

పదో తరగతి, 12వ తరగతి ఫలితాలను ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరగ్గా,  ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి.

భారత్‌తో పాటు మొత్తం 26 దేశాల్లో సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ను నిర్వహించారు. పరీక్షలు ఒకే షిఫ్టులో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరిగాయి. ఇక 10, 12వ తరగతి మొత్తం కలిపి దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు బోర్డు ఎగ్జామ్స్‌కి రిజిస్టర్‌ చేసుకున్నారు. 

CBSE BOARD RESULTS 2024: ఫలితాలను ఎక్కడ చూడొచ్చంటే

  • cbseresults.nic.in
  • results.cbse.nic.in
  • cbse.nic.in
  • cbse.gov.in
  • digilocker.gov.in
  • results.gov.in

 

#Tags