సుస్థిర అవకాశాలకు...పాపులర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు
భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు... ఇప్పుడు ప్రపంచమంతా కంప్యూటర్ చుట్టూ పరిభ్రమిస్తోంది. అందుకే ప్రస్తుతం ఏ చిన్న ఉద్యోగానికైనా కంప్యూటర్‌పై అవగాహన తప్పనిసరిగా మారింది. ఇక ఐటీ రంగంలోనైతే టెక్నాలజీ రోజురోజుకూ మారిపోతుంటుంది.
ఈ రోజున్న సాఫ్ట్‌వేర్ రేపటికి ఉండదు. కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, సాఫ్ట్‌వేర్స్, డేటాబేస్‌లు తెరపైకి వస్తుంటాయి. వాటిని నేర్చుకునేలోపే కనిపించకుండా పోతాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రంగాలకు విస్తరిస్తూ.. యువతకు సుస్థిర అవకాశాలు కల్పిస్తున్న పాపులర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు, వాటితో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
జావా :
ప్రస్తుతం జావా... బ్యాంకింగ్, టెలికామ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏవియేషన్, రిటైల్, కన్సూమర్ ప్రొడక్ట్స్, అకాడెమియా, లైఫ్ సెన్సైస్... ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో ప్రముఖ కంపెనీలు వినియోగిస్తున్న పాపులర్ సాఫ్ట్‌వేర్ కోర్సు ఇది. ప్రస్తుతం అత్యంత ప్రధానమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.. జావా. ఇదో మహా సముద్రం లాంటిది. ఆండ్రాయిడ్ యాప్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో సర్వర్ యాప్స్, ఈ-కామర్స్ రంగంలో, వెబ్ అప్లికేషన్స్ రాయడంలో జావా ఎంతో ఉపయుక్తంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోని హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, డిఫెన్స్, ఇంకా అనేక విభాగాల వెబ్ అప్లికేషన్స్ అన్నీ జావా ఆధారితంగా రూపొందించినవే. వీటితోపాటు సాఫ్ట్‌వేర్ టూల్స్, ట్రేడింగ్ అప్లికేషన్స్, బిగ్‌డేటా టెక్నాలజీలు, ఎంబడెడ్ స్పేస్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి సైంటిఫిక్ అప్లికేషన్స్‌లోనూ నేడు జావా విస్తృతంగా వినియోగిస్తున్నారు. కాబట్టి ఆయా రంగాల్లో పనిచేయాలనుకునే వారికి జావా నైపుణ్యం తప్పనిసరిగా మారింది. జావాపై పట్టు సాధించిన వారికి జాబ్ మార్కెట్‌లో అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు.
నేర్చుకునేందుకు వెబ్‌సైట్లు...
1. https://www.codecademy.com/learn/learn-java
2. https://www.homeandlearn.co.uk/index.html
3. https://examples.javacodegeeks.com/about/about-jcgs/
4. https://ocw.mit.edu/search/ocwsearch.htm?q=java
5. https://www.coursera.org/courses?query=java
సీ లాంగ్వేజ్ :
మన అరచేతిలోని స్మార్ట్‌ఫోన్.. సీ లాంగ్వేజ్‌లో రాసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగానే పనిచేస్తోందంటే నమ్ముతారా..! ఒక్క స్మార్ట్ ఫోన్ ఏమిటి... అనేక రకాల టెక్నాలజీల్లో సీ ల్వాంగేజ్ ఉపయోగిస్తు న్నారు. ఎందుకంటే ఇది హైలెవల్ కంప్యూటర్ లాంగ్వేజ్. అంటే... ఈ లాంగ్వేజ్‌లో రాసిన కోడ్‌ను ఎవరైనా ఇట్టే చదవగలరు, అర్థం చేసుకోగలరు. నాసా, ఇస్రో వంటి సంస్థలు సైతం తమ ప్రాజెక్టులను సీ లాంగ్వేజ్ కోడ్‌లో రాస్తుంటాయి. గత 50 ఏళ్లుగా గమనంలో ఉన్న ఈ సీ లాంగ్వేజ్... ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోనూ కీలకంగా మారింది. మనం నిత్యం ఉపయోగించే బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ వంటివన్నీ సీ లాంగ్వేజ్ కోడ్‌లో రాసినవే. సీలో రాసిన ప్రోగ్రామ్స్ వేగంగా ఫలితాలను ఇస్తుండటంవల్ల ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ విండోస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోనూ సీ లాంగ్వేజ్‌ను వాడుతున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మాత్రమే కాకుండా... నెట్‌వర్కింగ్, ఆటోమేషన్, రోబోటిక్స్, సిగ్నలింగ్ ప్రోటోకాల్స్, టెలికమ్యూనికేషన్స్, గేమింగ్, మైక్రోకంట్రోలర్స్, డేటాబేసెస్, లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటర్స్‌లోనూ సీ లాంగ్వేజ్ పాత్ర అమోఘమైంది. సీ లాంగ్వేజ్‌ను నేర్చుకోవడం కూడా తేలికే. సీకి ఉన్న పాపులారిటీ కారణంగా.. ఈ లాంగ్వేజ్‌పై పట్టు సాధించిన వారికి ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువే!
నేర్చుకునేందుకు వెబ్‌సైట్లు...
1. https://www.coursera.org/courses?query=c
2. https://ocw.mit.edu/search/ocwsearch.htm?q=c
3. https://www.udemy.com/n https://www.learn-c.org/
4. https://www.geeksforgeeks.org/
సీ ++
ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా వినియోగంలో ఉన్న మరో కంప్యూటర్ లాంగ్వేజ్‌గా సీ++ని పేర్కొనవచ్చు. సిస్టమ్స్ ప్రోగ్రామింగ్, డ్రైవర్స్, క్లయింట్ సర్వర్‌అప్లికేషన్స్, న్యూమరికల్ కంప్యూటింగ్, వీడియో గేమ్స్, డెస్క్‌టాప్ అప్లికేషన్స్, మొబైల్ ప్రోగ్రామింగ్, వెబ్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్, డేటాసైన్స్, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ వంటి రంగాల్లో సీ++ ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తోంది. ముఖ్యంగా గ్రాఫికల్ ఇంటర్‌ఫేజ్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేయడం కోసం ఈ కంప్యూటర్ లాంగ్వేజ్‌ను వినియోగిస్తున్నారు. వాస్తవానికి సీ++ను సీ లాంగ్వేజ్ ఆధారంగానే అభివృద్ధి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీకి కొనసాగింపే సీ++. ++ అనేవి పెరుగుదల, తగ్గుదలను సూచిస్తాయి. మొదట దీన్ని బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్, గేమింగ్/వీడియో టెక్నాలజీలో ఉపయోగించేవారు. ఇప్పుడు ఇది అన్ని విభాగాలకు విస్తరించింది. అయితే ఎక్కువ మంది ప్రోగ్రామర్‌లు సీ++ను నేర్చుకోవడం, ఉపయోగించడం కొంత క్లిష్టమనే అభిప్రాయంతో ఉంటారు.
నేర్చుకునేందుకు వెబ్‌సైట్లు...
1. https://www.programiz.com/cpp-programming
2. https://ocw.mit.edu/search/ocwsearch.htm?q=c%2B%2B
3. https://www.udemy.com
4. https://www.coursera.org
పైథాన్ :
ఎలాంటి సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ నేపథ్యం లేకున్నా.. చాలా త్వరగా, తేలిగ్గా నేర్చుకునేందుకు వీలు కల్పించే కంప్యూటర్ లాంగ్వేజ్... పైథాన్. దీన్ని సాధారణంగా సైంటిఫిక్ కంప్యూటింగ్, డేటామైనింగ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. దాంతోపాటు వెబ్ డవలప్‌మెంట్‌లోనూ పైథాన్‌ను వాడుతున్నారు. వెబ్ ప్రోగ్రామింగ్, డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌కు అత్యంత అనువైన కంప్యూటర్ లాంగ్వేజ్ ఇది. వెబ్ అప్లికేషన్స్ కోణంలో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా దీన్ని పేర్కొంటారు. దాదాపు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో, ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇది ఉపయోగపడుతుంది. సీ లాంగ్వేజ్ లాగే ఇది కూడా హైలెవెల్ కంప్యూటర్ లాంగ్వేజ్. యాప్స్ నుంచి గేమ్స్ వరకూ.. ఇది ఎంతో ఉపయుక్తం. దీనిపై పట్టు సాధిస్తే.. విభిన్న రంగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలుంది.
నేర్చుకునేందుకు వెబ్‌సైట్లు...
1. https://ocw.mit.edu/search/ocwsearch.htm?q=phython
2. https://www.coursera.org/courses?query=python
3. https://www.learnpython.org/
4. https://developers.google.com/edu/python
ఎస్‌ఏపీ (శాప్) :
ఎస్‌ఏపీ... ఇదో ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్‌వేర్. ఇది బాగా పాపులర్ సాఫ్ట్‌వేర్. కంపెనీల వ్యాపారాల పరంగా ఫైనాన్సెస్, లాజిస్టిక్స్, ప్రొడక్షన్, హ్యూమన్ రిసోర్సెస్ నిర్వహణలో ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సంస్థల వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన డేటా సమర్థ నిర్వహణలో శాప్ దోహదపడుతుంది. శాప్ నిపుణులకు హెల్త్‌కేర్, ఏరోస్పేస్, డిఫెన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ కాస్ట్ అకౌంట్స్ తదితర రంగాల్లో మంచి డిమాండ్ ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలోనూ శాప్ నిపుణుల అవసరం ఉంటుంది. అంతేకాకుండా ప్రొడక్షన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫార్మసీ, క్వాలిటీ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పనిచేసే నిపుణులకు శాప్‌పై అవగాహన ఉండటం తప్పనిసరి. శాప్‌పై పట్టు సాధించేందుకు ఆ సంస్థ అందించే సర్టిఫికేషన్స్ ఉపయోగపడతాయి. శాప్ సంస్థ వివిధ మాడ్యూల్స్‌కు సంబంధించి దాదాపు 160 వరకూ సర్టిఫికేషన్స్ అందిస్తోంది. ఈ సర్టిఫికేషన్స్ అసోసియేట్, స్పెషలిస్ట్స్, ప్రొఫెషనల్ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థి విద్యా నేపథ్యం, తాను చేరాలనుకుంటున్న రంగాన్ని బట్టి సంబంధిత మాడ్యూల్‌ను ఎంపిక చేసుకొని శిక్షణ పొందొచ్చు.
నేర్చుకునేందుకు వెబ్‌సైట్లు...
1. n https://www.sap.com/india/training-certification/free-training.html
2. https://www.udemy.com/learn-sap

#Tags