Union Budget 2024-25: వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తేదీ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను  వరుసగా ఏడోసారి ప్రవేశపెట్టారు. 

ఈమె మే 30, 2019 నుంచి ఆర్థికమంత్రిగా కొనసాగుతున్నారు. 2019లోనే న‌రేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను అందించారు. అప్ప‌టి నుంచి వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

ఎన్నికల సంవత్సరం కావడంతో.. ఆర్థిక సంవత్సరం 2023–24కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ పేరు మీద ఉన్న రికార్డును నిర్మలా సీతారామన్ బ్రేక్ చేశారు. 1959-1964 మధ్య మొరార్జీ దేశాయ్‌ ఐదు పూర్తిస్థాయి, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను సభ ముందుంచారు. రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రత్యేకత మాత్రం ఆయన సొంతమే.

Union Budget Highlights 2024-25 : కేంద్ర ఆర్థికమంత్రులుగా ఉండి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టని వారు వీరే.. కార‌ణం తెలిస్తే.. మీరే..

#Tags