Union Budget 2024: ప్రారంభం కానున్న కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. ఎప్పుడంటే..

కేంద్ర బడ్జెట్ సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ఆగస్టు 12 వరకు జరుగుతాయ‌ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ప్రకటించారు.

జూలై 23వ తేదీ లోక్‌సభలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్ట‌నున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక విధానాలు, పన్ను మార్పులు, కేటాయింపుల వివరాలు  ఉంటాయి.

నిర్మలా సరికొత్త రికార్డు..
వరుసగా రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టిస్తారు. ఈసారి బడ్జెట్‌తో సహా, నిర్మలా సీతారామన్ మొత్తం ఏడు కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డు సృష్టిస్తారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగా ఈమె గుర్తింపు పొందారు. మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Union Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో కీలకమైన అంశాలు ఇవే..!

#Tags