Clerk Posts at IBPS : ఐబీపీఎస్‌లో క్లర్క్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌).. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ (సీఆర్పీ) –XIV ద్వారా నిర్వహించనుంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 6,128 (ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104 ఖాళీలు).
»    అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
»    వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాతపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
»    బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సిండికేట్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్‌.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 21.07.2024.
»    ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్ట్, 2024.
»    ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: అక్టోబర్, 2024.
»    వెబ్‌సైట్‌: www.ibps.in

TSPSC Group 1 Prelims 2024 Results : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన వారు..

#Tags