Bank Jobs Applications : నేటి నుంచి 8,283 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
ఏదైన డిగ్రీ అర్హతతో నేటి నుంచి (నవంబర్ 17వ తేదీన) ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. చాలా రోజులు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇంతా భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలు ఇవే..
➤ జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సెల్స్) : 8,283
➤ అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
➤ వయస్సు : 01–04–2023 నాటికి 20–28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలాగే రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమతి సడలింపు కలదు
➤ తెలంగాణలో 525 ఉద్యోగాలు
➤ ఆంధ్రప్రదేశ్‌లో 50 ఉద్యోగాలు
➤ దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
➤ దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 17 నుంచి
➤ దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ 7వ తేదీ వరకు
➤ దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుయస్ లకు రూ.750/-(ఇతరులకు ఫీజు లేదు)
➤ బేసిక్ పే : రూ.19,900/-
➤ పరీక్ష తేదీలు : 2024 జనవరిలో ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.
SBI 8,283 Vacancies Details :