ఎస్‌బీఐ అప్రెంటీస్‌ సెలక్షన్‌లో.. స్టేజ్‌–2లో ఈ పరీక్ష సాధించాల్సిందే..

స్టేజ్‌–1 ఆన్‌లైన్‌ రాత పరీక్షలో నిర్ణయించిన కటాఫ్‌ మార్కులు దాటిన అభ్యర్థులను.. స్టేజ్‌2లో లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఎస్‌బీఐ తెలుగు రాష్ట్రాల స్థానిక భాషలుగా ‘తెలుగు/ఉర్దూ’ భాషలను పేర్కొంది.

అభ్యర్థి పదో తరగతి/ఇంటర్మీడియట్‌లో తెలుగు లేదా ఉర్దూ భాషను చదివినట్టు లాంగ్వేజ్‌ సర్టిఫికెట్‌/మార్క్‌షీట్‌ చూపితే.. వారికి స్థానిక భాష పరీక్ష నుంచి మినహాయింపునిచ్చి.. నేరుగా వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఇతరులు మాత్రం లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌కు హాజరు కావాలి. ఇందులో తెలుగు/ఉర్దూలో రాయడం, చదవడం, మాట్లాడటంతోపాటు అవగాహన చేసుకోవడంపై పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించిన వారికి బ్యాంక్‌ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి.. అప్రెంటిస్‌కు ఎంపిక చేస్తారు.

ప్రిపరేషన్‌ టిప్స్‌..
ఎక్కువ మంది పోటపడే ఎస్‌బీఐ అప్రెంటిస్‌ ఫైనల్‌లో నిలవాలంటే.. అభ్యర్థులు సంబంధిత సిలబస్‌ అంశాలను అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ప్రామాణిక పుస్తకాలు, లేదా మెటీరియల్‌ను సేకరించుకొని చదవడంతోపాటు నిత్యం ప్రాక్టీస్‌ చేయాలి. బడ్జెట్, వడ్డీ రేట్లు, ఇన్‌ఫ్లేషన్‌ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ కోసం దిన పత్రికలను, జీకే బుక్స్‌ను చదవడం లాభిస్తుంది. బక్షి రాసిన జనరల్‌ ఇంగ్లిష్‌ వంటి పుస్తకాలను ఉపయోగించి ఇంగ్లిష్‌పై పట్టు సాధించవచ్చు. మాక్‌ టెస్టులు, మోడల్‌ టెస్టుల ద్వారా ప్రిపరేషన్‌ స్థాయిని తెలుసుకుంటూ.. నైపుణ్యాలు పెంచుకోవాలి.

ముఖ్య సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.sbi.co.in/careers  

ఇంకా చ‌ద‌వండి : part 2: ఎస్‌బీఐ అప్రెంటిస్‌.. బ్యాంక్‌ కొలువుకు రహదారి






#Tags