APPSC New Exams Dates : ఏపీపీఎస్సీ వివిధ రాత పరీక్షల కొత్త‌ తేదీలు విడుద‌ల‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (APPSC) నిర్వ‌హించ‌నున్న వివిధ ప‌రీక్ష‌ల తేదీల‌ను ఎట్ట‌కేల‌కు విడుద‌ల చేసింది.

గ‌తంలో ఇచ్చిన‌ నాలుగు వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు వ‌చ్చే ఏడాది మార్చిలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న‌లో ఏపీపీఎస్సీ తెలిపింది.

➤☛ TSPSC Jobs Notifications 2024 : 21 నోటిఫికేషన్లు.. 12,403 ఉద్యోగాలకు..! ఇంకా..

కొత్త ప‌రీక్ష‌ల తేదీ ఇవే..
డాక్టర్‌ ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పరీక్షను మార్చి 24, 25వ తేదీల్లో, కాలుష్య నియంత్రణ బోర్డులోని అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్, అనలిస్ట్‌ గ్రేడ్‌-2 పరీక్షలను మార్చి 25, 26 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. అలాగే విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పరీక్షను మార్చి 26, 27న నిర్వహించనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ తెలిపారు.

#Tags