APPSC Exams Hall Tickets Download 2023 : వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ వివిధ పరీక్షల హాల్‌ టికెట్లు.. ఈలోగా హాల్‌టికెట్లల‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) త్వ‌ర‌లో నిర్వ‌హించే వివిధ ప‌రీక్ష‌ల హాల్‌టికెట్లల‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో టౌన్‌ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
APPSC Exams Hall tickets 2023 Released

ఆగ‌స్టు 18వ తేదీన ఉదయం, మధ్యాహ్నం పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు  www.psc.ap.gov.in  వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

ఏపీపీఎస్సీ వివిధ పరీక్షల ప్రివియ‌స్ పేప‌ర్ల కోసం క్లిక్ చేయండి

ఈలోగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి..

ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ అండ్‌ ఫుడ్‌ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో శాంపిల్‌ టేకర్‌ పోస్టుల భర్తీకి చేపట్టిన పరీక్ష ఆగ‌స్టు 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్‌టికెట్లు కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచామని, అభ్యర్థులు 18వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కారణాల రీత్యా ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు సర్విస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ సేవలు నిలిచిపోతాయని, ఆలోగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

☛ APPSC/TSPSC Group-2 Jobs Success Tips 2023 : గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

ఆగ‌స్టు 21, 22 తేదీల్లో ఏఈఈ పరీక్ష..


వివిధ ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ రాత పరీక్షను ఆగ‌స్టు 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్‌ టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు కమిషన్‌ కార్యదర్శి తెలిపారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో 21న మధ్యాహ్నం, 22న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

#Tags