APPSC Jobs Notifications 2025 : 5500 పోస్టులకు పైగా నోటిఫికేషన్.. ఎప్పుడంటే..?
జనవరి 12వ తేదీన ఈ ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీ అయిన 1670 పోస్టులతో పాటు కొత్తగా 1,016 పోస్టులు కలిపి మొత్తం 2,686 ఉద్యోగాల భర్తీకు అంతా సిద్ధమైంది.
☛➤ TS Government Jobs : 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇంకెప్పుడు భర్తీ చేస్తారు ...? ఈ ఏడాదిలో...
మొత్తం 19 నోటిఫికేషన్లు...?
జనవరి 12వ తేదీన 19 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో గ్రూప్-1 స్థాయి ఉద్యోగాలు కూడా 150 ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ వర్శిటీలు, ఆర్జేయూకేటీల్లో 3000 పైగా ఖాళీలు భర్తీ కానున్నాయి. గత ప్రభుత్వం ఈ ఏడాదిలో నోటిఫికేషన్లు జారీ చేసినా ఎన్నికల కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు వాటితో పాటు కొత్తగా ఖాళీ అయిన పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. జూలై నుంచి డిసెంబర్ నాటికి కొత్తగా విడుదల చేయనున్న 19 నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి కావచ్చు. ఈ కూటమి ప్రభుత్వం ప్రకటనలకే కానీ... నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.