AP Grama/Ward Sachivalayam : ఈ మార్కుల ఆధారంగానే.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్క కేటగిరీ ఉద్యోగి పనితీరు మదింపునకు వారి జాబ్‌చార్ట్‌ల ప్రకారం వేర్వేరు పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ ఉంటాయి.

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి పని తీరు మదింపునకు ప్రభుత్వం కొత్తగా పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ (ఉద్యోగి పనితీరు సూచికలు)ను రూపొందిస్తోంది.ఈ ఇండికేటర్స్‌ ఆధారంగా మండల స్థాయి అధికారులు ప్రతి నెలా వారి పరిధిలోని సచివాలయాల ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తారు. సంతృప్తికరం (గుడ్‌), తృప్తికరం (ఫెయిర్‌), పర్వాలేదు (శాటిస్ఫై),  అసంతృప్తికరం (నాట్‌ శాటిస్ఫై)గా రేటింగ్‌ ఇస్తారు. వరుసగా కొన్ని నెలలు అసంతృప్తికరం రేటింగ్‌ పొందే ఉద్యోగులకు మెళకువలు పెంపొందించుకునేలా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.

AP Grama Ward Sachivalayam Jobs : 14,000పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

ఉద్యోగాల జాబ్‌ నోటిఫికేషన్‌లలోనే.. ఇలా..
వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల జాబ్‌ నోటిఫికేషన్‌లలోనే ఉద్యోగుల పని తీరు నిరంతర అంచనా అంశాన్ని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. జాబ్‌ చార్ట్‌లను కూడా ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ఇటీవల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉద్దేశించిన కొన్ని సుస్థిర అభివృద్ధి సూచికలు (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌)ను రూపొందించుకొని ఆ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది.ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సిన సచివాలయాల ఉద్యోగులకు  కూడా ఈ సుస్థిర అభివృద్ధి సూచికల ప్రకారం పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ను రూపొందిస్తోంది. వీటి రూపకల్పన బాధ్యతను ప్రభుత్వం ఆయా ఉద్యోగుల విధులకు సంబంధించిన శాఖలకే అప్పగించింది. ఇప్పటివరకు ఆరు శాఖలు పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ను రూపొందించి, ఉత్తర్వులు కూడా జారీ చేశాయి.

Andhra Pradesh: గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల.. శాల‌రీ ఎంతంటే..?

➤ AP CM YS Jagan Mohan Reddy : గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీకి ఆదేశం.. ఇంకా అంగన్‌వాడీలను కూడా..

పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లకు పశు సంవర్ధక శాఖ, మహిళా పోలీసు ఉద్యోగులకు హోం శాఖ, ఏఎన్‌ఎంలకు వైద్య, ఆరోగ్య శాఖ, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు సాంఘిక సంక్షేమ శాఖ, ఆరు కేటగిరీల ఉద్యోగులకు పట్టణాభివృద్ధి శాఖ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ రూపొందించాయి. పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.

☛ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈ మార్కుల ఆధారంగానే..

వీరందరికీ వారి జాబ్‌ చార్ట్‌ ప్రకారం వంద మార్కులు ఉంటాయి. పని తీరు ఆధారంగా మార్కులు వేస్తారు. డిజిటల్‌ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా రేటింగ్‌ ఇచ్చారు. 90కిపైగా మార్కులు తెచ్చుకొనే డిజిటల్‌ అసిస్టెంట్లకు ఎక్సలెంట్‌ రేటింగ్‌ ఇస్తారు.  75–90 మార్కులు వచ్చేవారికి గుడ్‌ రేటింగ్, 50–75 మధ్య మార్కులు వచ్చేవారికి ఫెయిర్,  50 మార్కులకు కన్నా తక్కువ తెచ్చుకునే వారికి పూర్‌ రేటింగ్‌ ఇస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  మిగిలిన శాఖలు కూడా త్వరలో ఇండికేటర్స్‌ రూపొందిస్తాయని గ్రామ,వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు.

Andhra Pradesh : కీలక ఉత్తర్వులు.. గ్రామ, వార్డు సచివాలయాల‌ ఉద్యోగాలకు..

#Tags