Polytechnic: కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 2022–23 విద్యా సంవత్సరానికి రెండో షిఫ్ట్‌ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ 2022 మే 29న నిర్వహించనున్నారు.
కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 9న విడుదలైంది. ఈ పరీక్ష రాయడానికి పదో తరగతి/తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు, పదో తరగతి/తత్సమాన పరీక్షకు 2022 ఏప్రిల్‌/మేలో హాజరు కాబోతున్న విద్యార్థులు అర్హులు. ఈ పరీక్షకు ఆన్‌ లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభమై 18వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు ఫీజు రూ.400 చెల్లించాలి. దరఖాస్తు చేయడానికి ’https://polycetap.nic.in’ను సందర్శించాలని ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: 

​​​​​​​బహుళ అవకాశాల.. పాలిటెక్నిక్‌

ఐటీ, రోబోటిక్స్, కోడింగ్.. కొత్తగా ఐదు కోర్సులు!

#Tags