AP Police Constable Hall Ticket Download : కానిస్టేబుల్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే.. భారీగా ద‌ర‌ఖాస్తులు.. ఒక్కో పోస్టుకు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌.. 6,511 పోలీస్‌ ఉద్యోగాల(ఎస్‌ఐ-411, కానిస్టేబుల్‌ 6,100) భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే.

కానిస్టేబుల్ సివిల్‌, ఏపీఎస్పీ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రిలిమ్స్‌ రాతపరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 200ల మార్కులకు 3 గంటల వ్యవధిలో ఉంటుంది.అయితే పోలీసు కానిస్టేబుల్ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్లును పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ విడుద‌ల చేసింది. ఇక ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష జరుగనున్న‌ది.

చ‌ద‌వండి: AP Police Constable and SI Exams Previous Papers

భారీగా ద‌ర‌ఖాస్తులు.. ఒక్కో పోస్టుకు
ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జ‌న‌వ‌రి 12వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటలోపు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు గానూ దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు.

☛➤ ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌ రాత‌ప‌రీక్ష‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి 

కానిస్టేబుల్‌.. నాలుగు దశల్లో

☛ కానిస్టేబుల్‌ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా నాలుగు దశల్లో ఉంటుంది. 
☛ తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలు- 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.
☛ రెండో దశలో ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ ఉంటుంది. పురుష అభ్యర్థులు 167.6 సెం.మీ ఎత్తు, 86.3 సెం.మీ. ఛాతి కలిగుండాలి. 
☛ మహిళా అభ్యర్థులు 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
☛ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ విజేతలకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(1600 మీటర్లు,వంద మీటర్లు, లాంగ్‌ జంప్‌) నిర్వహిస్తారు. వీటిలో 1600 మీటర్ల టెస్టులో తప్పనిసరిగా అర్హత పొందాలి. అలాగే వంద మీటర్ల టెస్ట్, లాంగ్‌ జంప్‌ల్లో ఏదో ఒకదాంట్లో అర్హత సాధిస్తే సరిపోతుంది.

చ‌ద‌వండి: AP Police Recruitment 2022: 6,511 పోలీస్‌ కొలువులకు సిద్ధమా.. పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ఫైనల్‌ రాత పరీక్ష..
☛ ప్రిలిమినరీ, పీఎంటీ, పీఈటీలలో విజయం సాధించిన వారికి చివరగా ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. 
☛ ఈ పరీక్ష మూడు గంటల వ్యవధిలో 200 ప్రశ్నలు-200 మార్కులకు ఉంటుంది.
ఏపీఎస్సీ కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు 200 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
ప్రిలిమినరీ, ఫైనల్‌ రాత పరీక్షల్లో.. ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్‌ సైన్స్, హిస్టరీ, కరెంట్‌ అఫైర్స్, రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

చ‌ద‌వండి: AP Police Exams Bitbank

#Tags