Ward Volunteer Selected SI Post : వార్డు వలంటీర్‌గా ప‌నిచేస్తూ.. తొలి ప్ర‌య‌త్నంలోనే ఎస్సై ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుద‌ల చేసిన ఎస్ఐ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో సచివాలయంలో వలంటీరుగా ప‌నిచేస్తున్న యోగీశ్వరి ఎస్ఐ ఉద్యోగం సాధించారు.

పెదింటి బిడ్డైన యోగీశ్వరి ఎస్ఐ ఫ‌లితాల్లో స‌త్తాచాటి.. అనుకున్న ల‌క్ష్యం సాధించారు. ప్రయత్నిస్తుండాగానీ ఎంతటి కష్టతరమైన ఉద్యోగమైనా వచ్చి తీరుతుందని నిరూపించారు. 

ఏనాడు ల‌క్ష్యం మ‌రువ‌లేదు..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీ 6వ సచివాలయంలో వలంటీరుగా సేవలందిస్తూ.. ఖాళీ సమయంలో ఎస్సై ఉద్యోగానికి సిద్ధమై విజయం సాధించారు వలంటీరు జి.యోగీశ్వరి.ఈమె తండ్రి పెద్ద తిరుప‌త‌య్య గృహ నిర్మాణ కార్మీకుడిగా ప‌నిచేస్తున్నాడు. ఈమె అమ్మ పేరు ర‌మ‌ణ‌మ్మ‌. ఇంట్లో ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నా.. ఏనాడు ల‌క్ష్యం మ‌రువ‌లేదు. క‌ష్ట‌ప‌డి చ‌దివి ఎట్ట‌కేల‌కు అనుకున్న ఎస్ఐ ఉద్యోగం సాధించి.. అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈమె ఈ ఎస్ఐ ఉద్యోగాన్ని తొలి ప్ర‌య‌త్నంలో సాధించారు.

☛ Success Stories : ఎన్ని కష్టాలు ఉన్నా.. ఎస్ ఉద్యోగం కొట్టామిలా.. మా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే..

ఎడ్యుకేష‌న్ : 
1వ త‌ర‌గ‌తి నుంచి 7వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే చ‌దివాను. 8వ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బాలిక‌ల పాఠ‌శాల్లో చ‌దివాను. అలాగే ఇంట‌ర్ మాత్రం రెడ్డి ఉమెన్స్ కాలేజీలో పూర్తి చేశాను. ఇంట‌ర్ త‌ర్వాత క‌మ‌ల కాలేజీలో టీటీసీ పూర్తి చేశాను. డిగ్రీ మాత్రం SPKP Collegeలో చ‌దివాను. 

డీఎస్సీ లో ఫెయిల్‌.. ఎస్ఐ  ఉద్యోగంలో పాస్‌..
డీఎస్సీకి ప్రిప‌రేష‌న్ చేశాను. కానీ దీనిలో ఫెయిల్ అయ్యాను. త‌ర్వాత‌ వలంటీరుగా జాయిన్ అయ్యానే. ఇదే స‌మ‌యంలో.. కానిస్టేబుల్‌, ఎస్ఐ నోటిఫికేష‌న్ రావ‌డంతో.. ఈ రెండింటికి నేను ప్రిప‌రేష‌న్ కొన‌సాగించాను. నా క‌ష్టంకు.. ఫ‌లితంగా.. నేడు ఎస్ఐ ఉద్యోగం వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

 AP SI Job Selected Candidates: ఖాకీ స్టార్స్‌.. ఎస్ఐలుగా ఎంపికైన కానిస్టేబుళ్లు.. వీరే..!

వలంటీర్‌గా అవకాశం ఇచ్చిన..

ఈ నేప‌థ్యంలో ఈమెను ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ బాలమురళీకృష్ణ ఘనంగా సన్మానించారు. కష్టపడితే మంచి ఉద్యోగం సాధించవచ్చని యోగీశ్వరి నిరూపించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వలంటీర్‌గా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సహకారం అందించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, ప్రోత్సహించిన సయ్యద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ, బత్తుల లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బందికి ఈ సంద‌ర్భంగా యోగీశ్వరి ధన్యవాదాలు తెలిపారు.

AP SI Job Selected Candidates: ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించారు.. ఎస్‌ఐ ఫ‌లితాల్లో విజ‌యం సాధించారు.. వారు వీరే..

#Tags