Police Job: మూడో ప్రయత్నంలో దక్కిన గెలుపు.. పోలీస్‌ శాఖలో ఉద్యోగం

పోలీస్‌ శాఖలో పని చేయాలనేది ఆయన కల. తన చదువును పూర్తి చేసుకొని అక్కడే ఉంటూ తన పోలీస్‌ పరీక్షకు సిద్దమై పరీక్షలకు రాసాడు. అలా, ప్రస్తుతం అతను అనుకున్న లక్ష‍్యాన్ని చేరాడు..

మండలంలోని గుండుమల కేఎస్‌ తండాకు చెందిన రామక్క, నారాయణ నాయక్‌ దంపతుల రెండో కుమారుడు రమేష్‌నాయక్‌ ఇటీవల ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించారు. అనంతపురం ఆర్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన రమేశ్ అక్కడే ఉంటూ పోటీ పరీక్షకు సిద్ధమయ్యారు. రెండు సార్లు పోటీ పరీక్షలో తప్పినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు.

SI Success Story: ఉద్యోగం చేస్తూ ఎస్ఐగా కొలును సాధించాడు

తిరిగి, మరో ప్రయత్నంగా మూడో సారి సివిల్‌ ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించాడు. కాగా, గ్రామంలో రమేష్‌ నాయక్‌ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. రోజు వారీ కూలి పనులతో తల్లిదండ్రులు పిల్లలను చదివించారు. ఇప్పటికే మొదటి కుమారుడు చంద్రానాయక్‌ గుడిబండ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా, మూడో కుమారుడు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నారు. ఎస్‌ఐగా అర్హత సాధించిన రమేష్‌ నాయక్‌ను ఈ సందర్భంగా తండా వాసులు అభినందించారు. 

#Tags