Inspirational Story : నేను పుట్టిన‌ నెల రోజులకే తల్లిదండ్రులను కోల్పోయా.. ప్ర‌భుత్వ‌ హాస్టల్లో ఉంటూ చ‌దివి ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌.., క‌సి ఉంటే చాలు.. ఎంత‌టి ల‌క్ష్యంమైన ఛేదించ వ‌చ్చ‌ని నిరూపించాడు ఈ పేద‌యువ‌కుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు... అమ్మమ్మ దగ్గర పెరిగి అనంతరం హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం సాగించాడు.. డ్రైవర్‌గా పని చేసుకుంటూ తాను కలలుగన్న ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాడు పేదింటి బిడ్డ మురళీనాయక్‌.

ఈ నేప‌థ్యంలో ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించిన‌ పేదింటి బిడ్డ మురళీనాయక్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..  

కుటుంబ నేప‌థ్యం :
అన్నమయ్య జిల్లా.. కేవీపల్లె మండలం దిగువగళ్ల తాండాకు చెందిన వ్య‌క్తి బుక్కే మురళీనాయక్‌. మురళీనాయక్ జన్మించిన నెల రోజులకే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనంతరం అమ్మమ్మ శ్యామలమ్మ కూలి పనులు చేసుకుంటూ మురళీనాయక్‌ను పోషించింది. 

ఎడ్యుకేష‌న్ :
మురళీనాయక్.. కేవీపల్లె హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి వరకు కేవీపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. అనంతరం పీలేరులో హాస్టల్లో ఉంటూ పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ చదివాడు.

☛ Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ.. 

డ్రైవర్‌గా పని చేస్తూ..
అనంతరం తనను తాను పోషించుకోవడానికి డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చాడు. మరోవైపు ఎప్పటికై నా పోలీస్‌ కావాలనే తపనతో ఎస్‌ఐ రాతపరీక్షకు సిద్ధమయ్యాడు. 167.5 మార్కులు సాధించి ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. చదువుకు, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మురళీనాయక్‌ మాట్లాడుతూ.. ఇంతటితో ఆగకుండా ఒక్కో మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. ఏదైన సాధించాలంటే.. బ‌లమైన ప‌ట్టుద‌లతో ముందుకు సాగితే విజ‌యం కూడా త‌నంత‌ట అది వ‌చ్చితిరుతుంద‌ని నిరూపించాడు ఈ యువ‌కుడు.

 Success Stories : ఎన్ని కష్టాలు ఉన్నా.. ఎస్ఐ ఉద్యోగం కొట్టామిలా.. మా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే..

#Tags