AP SI Jobs: ఎస్‌ఐ పరుగు పోటీల్లో 409 మంది ఎంపిక

కర్నూలు: రాయలసీమ జోన్‌ ఎస్‌ఐ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్‌పీ రెండో పటాలం మైదానంలో 12వ రోజు దేహధారుడ్య పరీక్షలు నిర్వహించారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌ కుమార్‌, ఎస్పీ కృష్ణకాంత్‌ పర్యవేక్షించారు. సోమవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 800 మంది అభ్యర్థులను ఆహ్వానించగా 579 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ తరువాత బయోమెట్రిక్‌ ఎత్తు, ఛాతీ కొలతలు పరీక్షించారు. అనంతరం శారీర సామర్థ్య పరీక్షలు 1,600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 409 మంది అభ్యర్థులు ప్రతిభ కనబరిచి తుది రాత పరీక్షకు (మెయిన్స్‌) అర్హత సాధించారు. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు అందరూ ఒరిజనల్‌ మార్క్స్‌ మెమోతో పాటు మూడు సెట్లు గజిటెడ్‌ అధికారి సంతకంతో కూడిన జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
 

#Tags