SLPRB AP: ఎస్‌ఐ అభ్యర్థులు స్టేజ్‌–2 దరఖాస్తు సమర్పించాలి.. వీరిని మాత్రం ఈ పరీక్షలకు అనుమతించబోం

సాక్షి, అమరావతి: ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి తెలిపింది.
ఎస్‌ఐ అభ్యర్థులు స్టేజ్‌–2 దరఖాస్తు సమర్పించాలి.. వీరిని మాత్రం ఈ పరీక్షలకు అనుమతించబోం

వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన స్టేజ్‌–2 దరఖాస్తు ఫారాన్ని భర్తీచేసి జూలై 21 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3 సాయంత్రం 5 గంటలలోగా అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. అభ్యర్థుల రిజర్వేషన్, స్థానికత, వయో పరిమితిలో సడలింపు తదితర అంశాలను పరిశీలించేందుకు ఈ దరఖాస్తు సమర్పించాలని తెలిపింది. రాష్ట్రంలో 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి 2023 ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 38.28 శాతం మంది అంటే  57,923 మంది అర్హత సాధించారు.

చదవండి: ఈవెంట్స్‌లో విజయం సాధించండిలా...

మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు పోలీసు నియామక మండలి విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలుల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనుంది. అందుకు ముందుగా వారి సర్టిఫికెట్లను పరిశీలించాలని నిర్ణయించింది. అందుకోసం అభ్యర్థులు పదో తరగతి, ఇతర విద్యార్హత, కుల,  నేటివిటీ, మాజీ సైనికోద్యోగుల సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలని సూచించింది.

చదవండి:  ఈ టిప్స్ పాటిస్తే..ఈవెంట్స్ కొట్ట‌డం ఈజీనే..

ఆ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని ఆ కాపీతోపాటు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలని తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించనివారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసు నియామక మండలి చైర్మన్‌ అతుల్‌సింగ్‌ జూలై 19న ఓ ప్రకటనలో తెలిపారు. 
స్టేజ్‌–2 దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించేందుకు అభ్యర్థులు సంప్రదించాల్సిన రాష్ట్ర పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌ :  slprb.ap.gov.in

#Tags