Intermediate Exams 2024:నేటి నుంచి ఇంటర్‌ సంస్కృత మూల్యాంకనం

నేటి నుంచి ఇంటర్‌ సంస్కృత మూల్యాంకనం
నేటి నుంచి ఇంటర్‌ సంస్కృత మూల్యాంకనం

గుంటూరు : ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా సంస్కృత పేపర్ల స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియను శనివారం ప్రారంభిస్తున్నట్లు ఆర్‌ఐవో జీకే జుబేర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రారంభవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని సంస్కృత అధ్యాపకులందరు తప్పనిసరిగా హాజరు కావాలని, మిగిలిన సబ్జెక్టుల స్పాట్‌ వాల్యూయేషన్‌ షెడ్యూల్‌ను బోర్డు ప్రకటిస్తుందని తెలిపారు.

#Tags