Andhra Pradesh: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు చివ‌రి తేదీ ఇదే..

నెల్లూరు (టౌన్‌): ఈ ఏడాది ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు రూ.2,500 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లింపునకు జ‌నవ‌రి 10వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఆర్‌ఐఓ శ్రీనివాసరావు జ‌నవ‌రి 7న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జ‌నవ‌రి 19న విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ చేపడుతున్నట్లు చెప్పారు. 
ఈ సందర్భంగా జ‌నవ‌రి 8 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని కోరారు. 8న జిల్లాలోని అన్ని జూనియర్‌ కళాశాలల్లో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించాలన్నారు.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

అంబేడ్కర్‌– సామాజిక న్యాయం అన్న అంశంపై చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్‌, తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయాలన్నారు. ఇంటర్‌ డూప్లికేట్‌ పాస్‌ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు చెప్పారు. జ‌నవ‌రి 10 నుంచి apbie.apcfss.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు స్వీయ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక సమీకరణ, విద్యా సమానత, ఆచరణీయ నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంతో రూపొందించిన mybharath.gov.in వెబ్‌సైట్‌లో 15 ఏళ్లు నిండిన విద్యార్థులందరూ రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా కళాశాల ప్రిన్సిపాళ్లు కృషి చేయాలన్నారు.

#Tags