Inter Exams: ఇంటర్‌ పరీక్షలకు సమన్వయ సమీక్ష సమావేశం

వచ్చేనెల మార్చిలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేయాలని డీఆర్‌ఓ అధికారులకు ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో అధికారులతో చర్చించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పడక్బందీ చర్యలు చేపట్టాలని డీఆర్వో కె.మధుసూదన్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాలులో డీఆర్వో అధ్యక్షతన ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో 47,412 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 22,239 మంది..

Semester Results: మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

రెండో సంవత్సరం విద్యార్థులు 25,173 మంది ఉన్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని, అయితే విద్యార్థులు 8.30 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు రవాణా శాఖాధికారులు అవసరమైన వాహలను సమకూర్చాలన్నారు. పరీక్షలు పూర్తయిన తరువాత సమాధాన పత్రాలను సీల్డ్‌ కవర్‌లో పోస్టల్‌ శాఖకు వెంటనే పంపాలన్నారు. పరీక్షా కేంద్రాలలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.

Nadu-Nedu schools: రూ.492 కోట్లతో పాఠశాలల అభివృద్ధి..

ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ విధించాలని పోలీసులను ఆదేశించారు. సమస్యత్మాక పరీక్షా కేంద్రాలైన పత్తికొండ, దేవనకొండ, కోసిగి, చిప్పగిరి, ఆలూరులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్‌ఐఓ గురవయ్యశెట్టి, డీవీఈఓ జమీర్‌బాషా, డీఈఓ శామ్యూల్‌ పాల్గొన్నారు.

#Tags