AP Genco Jobs: ఏపీ జెన్‌కోలో ఖాళీలు భర్తీ చేయాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఆర్‌టీపీపీ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి వి. గంగా సురేష్‌ ప్రభుత్వాన్ని కోరారు.

అక్టోబర్ 19న నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో దాదాపు 2500 పైచిలుకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు ఇందులో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ 387, జూనియర్‌ ప్లాంట్‌ అసిస్టెంట్‌ 1761 , జూనియర్‌ అకౌంటెంట్‌ ఆఫీసర్‌ 33, జూనియర్‌ అసిస్టెంట్‌ 87, వీటితో పాటు మరిన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు.

చదవండి: Apprentice Posts : కొంకణ్‌ రైల్వేలో 190 గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు..

అధికారంలోకి రాగానే ఖాళీలు భర్తీ చేస్తామని కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్‌టీపీపీ ఏర్పాటు కోసం రైతులు భూములు ఇచ్చారని, వారికి పరిహారంగా 50శాతం ఉద్యోగాలు కల్పించాలని జీవో 98లో స్పష్టంగా చెబుతున్నా జెన్‌ కో యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అమలు చేయలేదన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బి దస్తగిరి, నగర సహాయ కార్యదర్శి సంజయ్‌ , వెంకటేష్‌ లు పాల్గొన్నారు.

#Tags