APEAPCET 2024: రైతు బిడ్డకు రాష్ట్రస్థాయి ఈఏపీ సెట్‌లో నాల్గో ర్యాంకు

APEAPCET 2024: రైతు బిడ్డకు రాష్ట్రస్థాయి ఈఏపీ సెట్‌లో నాల్గో ర్యాంకు

అనంతపురం : ఈఏపీసెట్‌లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన రైతుబిడ్డ పాలగిరి సతీష్‌రెడ్డి రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు పాలగిరి కుమారి, లక్ష్మీరెడ్డి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సతీష్‌రెడ్డి 96.0330 మార్కులతో రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో దేశస్థాయి ఓపెన్‌ కేటగిరీలో 175వ ర్యాంకు సాధించాడు. భవిష్యత్తులో సివిల్స్‌లో సత్తా చాటి ప్రజాసేవ చేయాలన్నదే లక్ష్యమని విద్యార్థి తెలిపాడు.

అక్కడ 6వ ర్యాంకు, ఇక్కడ 8వ ర్యాంకు

అనంతపురం ఆర్కే నగర్‌కు చెందిన పుట్టి నాగేంద్ర, పుట్టి మణిమాల దంపతుల కుమారుడు కుషాల్‌ కుమార్‌ ఇటీవల విడుదలైన తెలంగాణ ఈఏపీసెట్‌లో 6వ ర్యాంకు సాధించాడు. ఏపీఈఏపీసెట్‌లో 94.3563 మార్కులతో 8వ ర్యాంకు సాధించాడు. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో దేశస్థాయి ఓపెన్‌ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించడం గమనార్హం. ఈ సందర్భంగా కుషాల్‌ కుమార్‌ మాట్లాడుతూ ఐఐటీ ముంబైలో సీఎస్సీ కంప్యూటర్స్‌లో చేరతానన్నాడు.

Also Read :  TGPSC Group1 Prelims Answer Key

● వీరితో పాటు పలువురు జిల్లా విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. తాడిపత్రి పట్టణం జయనగర్‌ కాలనీకి చెందిన కొండ్రెడ్డి కిషోర్‌రెడ్డి కుమారుడు సాయి హనీష్‌రెడ్డి రాష్ట్రస్థాయి 28వ ర్యాంకు సాధించాడు. అలాగే యాడికి మండల కేంద్రానికి చెందిన కొండారెడ్డి కుమారుడు జస్వంత్‌ రెడ్డి 61వ ర్యాంకు, కణేకల్లుకు చెందిన ఎండికట్ల శ్రీనివాసులు కుమారుడు ఠాగూర్‌ రవీంద్రశ్రీ 101 ర్యాంకు, అనంతపురంలోని గంగానగర్‌కు చెందిన డి.పోతురాజు కుమారుడు సాయితేజేష్‌ 118వ ర్యాంకు, వేణుగోపాల్‌నగర్‌కుచెందిన గుంటకంటి శివప్రసాద్‌ కుమారుడు సాయి గౌతమ్‌ 125వ ర్యాంకు, తాడిపత్రి నవరంగ్‌ థియేటర్‌ వీధికి చెందిన రాచమడుగు వెంకట శ్రీనివాసులు కుమారుడు వెంకటసాయి చరణ్‌ 214వ ర్యాంకు, అనంతపురం సోమ నాథ్‌నగర్‌కు చెందిన గోసకొండ భరద్వాజ్‌ కుమారుడు శశికిరణ్‌ 281వ ర్యాంకు, రామచంద్రనగర్‌కు చెందిన ప్రభందం సాయి విజయ రాఘవ కుమారుడు శ్రీనికేతన్‌ 345వ ర్యాంకు, తాడిపత్రి పట్టణం గురులాడ్జ్‌ వీధికి చెందిన సంగటి శ్రీనివాసరెడ్డి కుమారుడు చక్రధర్‌రెడ్డి 366వ ర్యాంకులతో ప్రతిభ చాటారు.

#Tags