AP EAPCET Seat Allotment: రేపట్నుంచి ఇంజనీరింగ్‌ క్లాసులు ప్రారంభం.. అప్పటిలోగా రిపోర్ట్‌ చేయకపోతే సీటు కోల్పోయే ఛాన్స్‌

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఉన్నత విద్యా మండలి ఇంజినీరింగ్‌ కళాశాలల అలాట్‌మెంట్‌లను బుధవారం ప్రకటించింది. ఏపీఈఏపీ సెట్‌ – 2024 ఎంపీసీ స్ట్రీమ్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 1 నుంచి 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. విద్యార్థులు ఇచ్చుకున్న ఆప్షన్లు, ర్యాంకు మెరిట్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా సీట్లు కేటాయించారు.

Job Reservation Bill: రాష్ట్రాన్ని విడిచివెళ్లనున్న టెక్ కంపెనీలు.. కార‌ణం ఇదే..

జిల్లాలోని నాలుగు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 2154 సీట్లు ఉండగా, 1847 ప్రవేశాలు జరిగాయి. 85.74 శాతం ప్రవేశాలు జరిగాయి. ప్రైవేట్‌ కళాశాలల్లో 70 శాతం కన్వీనర్‌ కోటా, 30 శాతం మేనేజ్‌ మెంట్‌ కోటా పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. టెక్కలి ఐతం కళాశాలలో 1104 సీట్లకు 1075, చిలకపాలేంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో 384 సీట్లకు 295, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో 336 సీట్లకు 228, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో 330 సీట్లకు 249 ప్రవేశాలు జరిగాయి.

Teacher Appointments: 8,600 మంది కొత్త టీచర్లు

క్లాస్‌వర్క్‌ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సీట్లు లభించిన విద్యార్థులు 22వ తేదీ లోపు కళాశాలలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. లేదంటే సీట్లు కోల్పోతారు. త్వరలో ఉన్నత విద్యా మండలి తుది విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ కౌన్సెలింగ్‌లో ఏపీఈఏపీ సెట్‌లో మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరు కానివారికి హాజరయ్యే అవకాశం లభిస్తుంది. మొదటి కౌన్సెలింగ్‌లో సీటు లభించిన వారికి కళాశాల, బ్రాంచ్‌లు మార్చుకునే అవకాశం వస్తుంది.
 

#Tags